IND vs SA: కేరళలో గత రెండు రోజులుగా వర్షాలు.. నేటి మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం ఉండనుందంటే?
India vs South Africa 1st T20: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్‌లో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య నేడు మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
India vs South Africa 1st T20: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్‌లో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య నేడు మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే వాతావరణ నివేదిక ప్రకారం, తిరువనంతపురం చుట్టూ మేఘావృతమైన వాతావరణం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలోనూ వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నేడు మైదానాన్ని మబ్బులు కమ్మే అవకాశం ఉందని, వర్షం రావడానికి 50 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉందని ఇందులో పేర్కొంది. కాగా గత రెండు రోజులుగా కేరళలో వాతావరణం చల్లగా మారింది. మంగళవారం కూడా అక్కడ వర్షం కురిసింది. ఈనేపథ్యంలో వర్షం పడితే కుదించిన ఓవర్లతో మ్యాచ్ నిర్వహించవచ్చని తెలుస్తోంది.
ఇక గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ముందు బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించగా.. మరో మ్యాచ్ ఛేజింగ్ టీమ్ గెలిచింది. కాగా 2017లో న్యూజిలాండ్‌తో ఎనిమిది ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు ఆడినా భారత్ ఒక్క సిరీస్‌నూ కైవసం చేసుకోలేకపోయింది. 2015లో దక్షిణాఫ్రికా 2–0తో సిరీస్‌ను దక్కించుకోగా… 2019లో, 2022లో సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. మరి ఈ సిరీస్‌లోనైనా ఫలితం మారుతుందేమో చూడాలి.
భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా ఉంది..
- సెప్టెంబర్ 28- మొదటి T20 మ్యాచ్ (తిరువనంతపురం)
- అక్టోబర్ 2- 2వ T20 మ్యాచ్ (గౌహతి)
- అక్టోబర్ 4- 3వ T20 మ్యాచ్ (ఇండోర్)
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్, జస్ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, జార్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్‌గిడి, ఎన్రిక్ నోర్కియా, వేన్ పార్నెల్, ఆండిల్ ఫెలుక్వాయోస్, డివే ప్రెనియోటోరియస్, , రిలే రోసో, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..