AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భారత్‌- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. హెచ్‌సీఏపై మరో కేసు నమోదు.. ఈసారి దేనికో తెలుసా?

తాజాగా బేగంపేట పోలీసులు హెచ్‌సీఏపై మరో కేసు నమోదు చేశారు. మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ వ్యత్యాసం ఉందంటూ ఓ యువకుడు బేగంపేట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

Hyderabad: భారత్‌- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. హెచ్‌సీఏపై మరో కేసు నమోదు.. ఈసారి దేనికో తెలుసా?
Ind vs Aus Match Tickets
Basha Shek
|

Updated on: Sep 28, 2022 | 11:40 AM

Share

భారత్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడో మ్యాచ్‌ జరిగింది. కాగా ఈ మ్యాచ్‌ టికెట్ల విక్రయంలో తీవ్ర గందరగోళం ఏర్పడి తొక్కిసలాట కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయాలకు సంబంధించి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా బేగంపేట పోలీసులు హెచ్‌సీఏపై మరో కేసు నమోదు చేశారు. మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ వ్యత్యాసం ఉందంటూ ఓ యువకుడు బేగంపేట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. టికెట్‌పై మ్యాచ్‌ ప్రారంభ సమయం 7.30 ఉండగా.. 7 గంటలకే మ్యాచ్‌ ప్రారంభమైందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడా యువకుడు. దీంతో బేగంపేట పోలీసులు హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ పై కేసు ఫైల్ చేశారు. తాజాగా నమోదైన కేసుతో హెచ్‌సీపై నమోదైన కేసుల సంఖ్య మొత్తం 4 కు చేరింది.

కాగా ఉప్పల్‌ మ్యాచ్ టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ లో పెట్టిన కాసేపటికే టికెట్లు అమ్ముడుపోయానని చూపించడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆఫ్ లైన్ లో టికెట్లు ఇస్తామని హెచ్‌సీఏ ప్రకటించడంతో వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు జింఖానా మైదానానికి చేరుకుని టికెట్లు దక్కించుకోవడానికి ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈనేపథ్యంలో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ, ఏర్పాట్లలో హెచ్‌సీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!