IND vs BAN: వరుసగా 4వ విజయం.. 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన రోహిత్ సేన..
పూణెలోని ఎంసీఏ మైదానంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసింది. 257 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ 41.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఛేదించారు. విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 69వ అర్ధశతకం సాధించగా, శుభమాన్ గిల్ 10వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. రోహిత్‌తో కలిసి గిల్ 76 బంతుల్లో 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

India vs Bangladesh: ప్రపంచకప్ 2023లో టీమిండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ వన్డేల్లో 48వ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 26 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. అతను 567 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు సచిన్ టెండూల్కర్ 600 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
పూణెలోని ఎంసీఏ మైదానంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసింది. 257 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ 41.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఛేదించారు. విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 69వ అర్ధశతకం సాధించగా, శుభమాన్ గిల్ 10వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. రోహిత్‌తో కలిసి గిల్ 76 బంతుల్లో 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
𝙃𝙐𝙉𝘿𝙍𝙀𝘿!
Number 4⃣8⃣ in ODIsNumber 7⃣8⃣ in international cricket
Take a bow King Kohli 👑🙌#CWC23 | #TeamIndia | #INDvBAN | #MenInBlue pic.twitter.com/YN8XOrdETH
— BCCI (@BCCI) October 19, 2023
ఇరు జట్లు:
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.