IND vs AUS: ఇండోర్ టెస్టుకు ముందు ఇరకాటంలో ఆస్ట్రేలియా.. కీలక ఆటగాళ్ల దూరం.. ప్లేయింగ్ 11పై భారీ ఎఫెక్ట్..

Indore Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మూడో టెస్టు జరగనుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.

IND vs AUS: ఇండోర్ టెస్టుకు ముందు ఇరకాటంలో ఆస్ట్రేలియా.. కీలక ఆటగాళ్ల దూరం.. ప్లేయింగ్ 11పై భారీ ఎఫెక్ట్..
Ind Vs Aus
Follow us
Venkata Chari

|

Updated on: Feb 23, 2023 | 8:30 AM

Australia Playing 11 vs India: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మూడో టెస్టు జరగనుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కాబట్టి సిరీస్ గెలవకుండా భారత్‌ను ఆపాలంటే, ఇండోర్ టెస్టులో ఎలాగైనా గెలవాలి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ప్లేయింగ్ 11 కాంబినేషన్‌ను ఎంచుకోవడం అతిపెద్ద సవాలుగా మారనుంది.

నిజానికి, ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, జోస్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. స్పిన్నర్ ఆష్టన్ ఎగ్గర్ కూడా దేశవాళీ టోర్నీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్, స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ కూడా వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు వెళ్లారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు మూడవ టెస్ట్‌కు ముందు భారతదేశానికి తిరిగి వస్తారని భావిస్తున్నారు.

కెప్టెన్ పాట్ కమిన్స్ భారత్‌కు తిరిగి రావడానికి టిక్కెట్ బుక్ చేసుకున్నాడని, అయితే అతను ఎప్పుడు తిరిగి వస్తాడు, మూడవ టెస్ట్ ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితి అని ఒక నివేదికలో వెల్లడైంది. జట్టులోని మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీ కూడా సైడ్ స్ట్రెయిన్‌తో పోరాడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇబ్బందులో కూరుకపోయింది.

ఇవి కూడా చదవండి

మూడో టెస్టుకు ముందే ఆస్ట్రేలియాకు ఇబ్బందులు..

ఇండోర్‌లో ఇప్పటివరకు రెండు టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల్లో స్పిన్నర్లదే ఆధిపత్యం. అంటే నాగ్ పూర్, ఢిల్లీ తరహాలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ముందు స్పిన్ బౌలింగ్ అత్యంత కష్టాలు సృష్టిస్తుంది. మరోవైపు, టాడ్ మర్ఫీ ఆస్ట్రేలియాకు పూర్తి ఫిట్ కాకపోతే, నాథన్ లియాన్ తప్ప, వారికి వేరే మంచి స్పిన్నర్ లేడు. ఢిల్లీ టెస్ట్‌లో మాథ్యూ కుహ్నెమాన్ పేలవంగా మారాడు. మిచెల్ స్వెప్సన్ అంతగా ఆకట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దించే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌కు కామెరాన్ గ్రీన్ పూర్తి ఫిట్‌గా ఉండటం ఆస్ట్రేలియాకు మంచి విషయం. ఇటువంటి పరిస్థితిలో, అతను బ్యాట్, బాల్ రెండింటిలోనూ కంగారూ జట్టుకు కీలక పాత్ర పోషించగలడు.

ఆస్ట్రేలియా జట్టు ఇలా ఉండొచ్చు: ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, మాథ్యూ కుహ్నెమాన్.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..