ODI: వన్డేల్లో అమేజింగ్ ప్లేయర్స్.. కెరీర్‌లకు అర్ధాంతరంగా ఫుల్‌స్టాప్.. లిస్టులో సచిన్ ఫ్రెండ్!

వన్డేలకు సుమారు 53 ఏళ్ల చరిత్ర ఉంది. 1971లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ చోటు చేసుకుంది. ఇందులో కంగారూలు 5 వికెట్ల తేడాతో..

ODI: వన్డేల్లో అమేజింగ్ ప్లేయర్స్.. కెరీర్‌లకు అర్ధాంతరంగా ఫుల్‌స్టాప్.. లిస్టులో సచిన్ ఫ్రెండ్!
క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు ఒక ఆటగాడు 50 బంతుల్లో 100 పరుగులు చేస్తే.. ఆ తర్వాత మ్యాచ్‌లో అతను మొదటి బంతికే అవుట్ అవుతుంటాడు. ఓజట్టు ఓడిపోతుందని భావిస్తే, గెలుస్తుంది. ఇలా ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కో ఫార్మాట్ ప్రకారం ఆటగాళ్లు కూడా దానికి తగ్గట్టుగానే మారుతూ బ్యాటింగ్ చేస్తుంటారు. అయితే, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ ఒక ఫార్మాట్‌ను తమ ఫేవరేట్‌గా ఎంచుకుంటుంటారు. దానిలో అద్భుతంగా రాణిస్తారు. అయితే, కొంతమంది ప్లేయర్లు మాత్రం ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగలు వర్షం కురిపిస్తుంటారు. అందరి అంచానాలను తప్పుగా నిరూపిస్తుంటారు. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి ఆటగాళ్లు 5గురు ఉన్నారు. తమ జోన్ నుంచి బయటపడి, వేరే ఫార్మాట్‌లోనూ ఊహించని విధంగా విజయం సాధించారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2023 | 9:20 AM

వన్డేలకు సుమారు 53 ఏళ్ల చరిత్ర ఉంది. 1971లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ చోటు చేసుకుంది. ఇందులో కంగారూలు 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు. అప్పటి నుంచి నేటి వరకు వన్డేల్లోకి ఎంతోమంది దిగ్గజ బ్యాటర్లు అరంగేట్రం చేశారు. ఎన్నో అద్భుతమైన రికార్డులు నెలకొల్పారు. అయితే వన్డేల్లో పలువురు అమేజింగ్‌ బ్యాటర్లు.. తమ కెరీర్‌లకు అర్ధాంతరంగా ఫుల్‌స్టాప్ పెట్టారని మీకు తెలుసా.? లిస్టులో దిగ్గజాలు, సచిన్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా.?

  • జేమ్స్ టేలర్:

జేమ్స్ టేలర్ అండర్-19 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వన్డేలలో అమేజింగ్ బ్యాటర్‌గా ఎదిగాడు. 2011లో వన్డేల్లో, 2012లో టెస్ట్ డెబ్యూ చేశాడు. అయితేనేం అతడ్ని విధి వెంటాడింది. జేమ్స్ టేలర్‌కు అరుదైన గుండె జబ్బు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో.. కేవలం 26 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్‌లో కోచ్‌గా, వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు.

  • జోనాథన్ ట్రాట్:

ఇంగ్లాండ్ క్రికెట్‌కు చాలాకాలం పాటు జోనాథన్ ట్రాట్ నెంబర్ 3లో టాప్ రన్ గెట్టర్‌. అలాగే 2011లో ఐసీసీ, ఈసీబీ నుంచి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. పలు కీలక మ్యాచ్‌లలో ట్రాట్ ఇంగ్లాండ్ తరపున బ్యాటింగ్‌లో యాంకర్ రోల్ పోషించాడు. అయితే 2013 -14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఘోర ఓటమి చవి చూడటం.. మాజీ క్రికెటర్ల నుంచి విమర్శల వర్షం కురవడంతో ట్రాట్ స్ట్రెస్‌కు లోనయ్యాడు. తద్వారా క్రికెట్‌ నుంచి రిటైర్ అయ్యాడు.

  • మార్క్ బౌచర్:

దక్షిణాఫ్రికా తరఫున ఆడిన అత్యుత్తమ వికెట్ కీపర్ మార్క్ బౌచర్. అనూహ్యంగా జరిగిన ఓ ఫ్రీక్ యాక్సిడెంట్‌ కారణంగా అతడి కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయింది. 2012లో క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ ఘటన ఏంటంటే.. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతి స్టంప్‌లకు తగలడం.. బెయిల్ నేరుగా బౌచర్ కంటికి గుచ్చుకోవడంతో.. అతడి కెరీర్‌కు గట్టి దెబ్బ పడింది. ఆ సమయంలో వైద్యులు.. బౌచర్‌ను అస్సలు క్రికెట్ ఆడకూడదని సలహా ఇచ్చారు.

  • వినోద్ కాంబ్లీ:

సచిన్ అరంగేట్రానికి, కాంబ్లీ అరంగేట్రానికి మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. సచిన్ నవంబర్ 1989లో పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. కాంబ్లీ 1991లో అదే జట్టుపై వన్డే మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. కాంబ్లీ టెస్టు కెరీర్ ఆరంభం అద్భుతంగా సాగింది. అతడు ఫిబ్రవరి 1993లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తొలి ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. అయితే దీని తర్వాత ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ బ్యాట్‌తో ఫ్లాప్ షో చూపించాడు. అనంతరం సెలెక్టర్లు అతడ్ని జట్టు నుంచి తప్పించారు. వన్డేలలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో కాంబ్లీ కెరీర్ పూర్తయిపోయింది.

  • కెవిన్ పీటర్సన్:

ఇంగ్లాండ్ నేచురల్ ప్లేయర్స్‌లో కెవిన్ పీటర్సన్ ఒకరు. 2004లో వన్డేలు, 2005లో టెస్ట్ డెబ్యూ చేశాడు. 2005 ఓవల్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లో కెవిన్ పీటర్సన్.. బ్రెట్ లీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్‌ లాంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కుని 158 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటి నుంచి తరచూ ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇతడు.. ప్రతీసారి వివాదాల్లో ఇరుక్కుంటూ వచ్చాడు. కట్ చేస్తే.. కెరీర్ అర్ధాంతరంగా ఖేల్ ఖతం అయింది.