AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE 2nd T20I: 3ఏళ్ల తర్వాత టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకముందే సిరీస్ కోల్పోయిన శ్రేయస్ సేన..?

Belfast Weather Update: నేడు (ఆదివారం) జరగబోయే రెండో టీ20 మ్యాచ్ టీమిండియా పరువుకు సవాల్‌గా మారింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తన ముద్ర వేయాలన్నా, భారత్ తన అజేయ రికార్డును కాపాడుకోవాలన్నా ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం. మరి వరుణుడు కరుణించి, భారత వీరులు ఐర్లాండ్ గడ్డపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో చూడాలి.

IND vs IRE 2nd T20I: 3ఏళ్ల తర్వాత టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకముందే సిరీస్ కోల్పోయిన శ్రేయస్ సేన..?
Ind Vs Ire 2nd T20i Weather
Venkata Chari
|

Updated on: Jun 28, 2026 | 3:14 PM

Share

IND vs IRE 2nd T20I: ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మొదటి టీ20 మ్యాచ్‌లో అనూహ్య ఓటమిని చవిచూసిన టీమిండియా, నేడు జరగబోయే నిర్ణయాత్మక రెండో మ్యాచ్‌కు ముందు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. బెల్ఫాస్ట్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారత జట్టు కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో సిరీస్ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

వర్షార్పణమైన ప్రాక్టీస్ సెషన్.. శ్రేయస్ అయ్యర్‌కు అగ్నిపరీక్ష..

కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన భారత జట్టుకు ఐర్లాండ్ చుక్కలు చూపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత, తప్పులను సరిదిద్దుకోవడానికి ఆటగాళ్లకు లభించిన ఏకైక అవకాశాన్ని వరుణుడు ముంచేశాడు. బెల్ఫాస్ట్‌లోని మైదానం మొత్తం తడిసిపోవడంతో శనివారం నాటి శిక్షణా శిబిరాన్ని పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు..

మొదటి మ్యాచ్‌లోనే కాకుండా, రెండో మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను కలవరపెడుతోంది. ఒకవేళ ఈ రోజు జరగాల్సిన రెండో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే, భారత్ ఈ సిరీస్‌ను 0-1తో ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవాల్సి వస్తుంది. క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై భారత్ సిరీస్ కోల్పోవడం అనేది ఊహించని పెద్ద ఘోరకలి అవుతుంది.

పిచ్ పరిస్థితులకు అలవాటు పడాలి: అభిషేక్ శర్మ

మొదటి మ్యాచ్‌లో భారత బ్యాటర్లందరూ చేతులెత్తేసిన వేళ, ఒంటరి పోరాటం చేసిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విలేకరులతో మాట్లాడుతూ.. “ఇలాంటి విదేశీ పరిస్థితులకు మనం ఎంత వేగంగా అలవాటు పడితే అంత మంచిది. ఒకదాని వెనుక ఒకటి మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు, పిచ్ స్వభావాన్ని త్వరగా అర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ గత మ్యాచ్‌లో మేము ఆ పని చేయలేకపోయాము” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాక్టీస్ సెషన్లు రద్దు కావడం జట్టు వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అతడు పరోక్షంగా అంగీకరించాడు.

ఒత్తిడిలో ‘మెన్ ఇన్ బ్లూ’.. మూడేళ్ల రికార్డుకు బ్రేక్ పడేనా?

తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఆరంభంలోనే వికెట్లు తీసినప్పటికీ.. ఐర్లాండ్ కెప్టెన్ లీడర్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 148 పరుగులకే కుప్పకూలి 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 49 పరుగులు చేసి మెరుపులు మెరిపించినా, మిగిలిన ఆటగాళ్ల బాధ్యతారాహిత్యం జట్టును ముంచేసింది.

ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!

గత మూడేళ్లుగా (ఆగస్టు 2023 నుంచి) భారత్ ఆడిన ఏ ఒక్క టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. వెస్టిండీస్ చేతిలో ఓడిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా అప్రతిహత విజయయాత్రకు ఇప్పుడు ఐర్లాండ్ బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. ఒకవేళ ఈ రోజు భారత్ అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ గెలిచినా, సిరీస్ కేవలం 1-1తో సమం అవుతుందే తప్ప సిరీస్ సొంతం కాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us