IND vs ENG: భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. టీ20, వన్డే సిరీస్‌ల ఫుల్ షెడ్యూల్ ఇదిగో
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రెండు సిరీస్‌లకు సంబంధించిన ఇప్పటికే ఇరు జట్లను ప్రకటించారు. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తారు. రెండు సిరీస్‌ల మ్యాచ్‌ల షెడ్యూల్ చూద్దాం రండి..

జనవరి 22 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్, 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ముందుగా టీ20 సిరీస్, తర్వాత వన్డే సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టును ముందుగా ప్రకటించిన బీసీసీఐ.. శనివారం (జనవరి 18) వన్డే సిరీస్‌కు కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
టీ 20 సిరీస్ షెడ్యూల్
- తొలి టీ20 మ్యాచ్ – జనవరి 22, కోల్‌కతా
- రెండో టీ20 మ్యాచ్ – జనవరి 25, చెన్నై
- మూడో టీ20 మ్యాచ్ – జనవరి 28, రాజ్‌కోట్
- నాలుగో టీ20 మ్యాచ్ – జనవరి 31, పూణె
- ఐదవ T20 మ్యాచ్ – 2 ఫిబ్రవరి, ముంబై
వన్ డే సిరీస్ షెడ్యూల్
- మొదటి వన్డే: ఫిబ్రవరి 6, నాగ్‌పూర్
- రెండో వన్డే: ఫిబ్రవరి 9, కటక్
- మూడో వన్డే: ఫిబ్రవరి 12, అహ్మదాబాద్
టీ20 సిరీస్ కోసం ఇరు జట్లు
టీమ్ ఇండియా:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమ్మీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్).
ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ .
వన్డే సిరీస్‌కు రెండు జట్లు
టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యస్సవి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ .
విమానాశ్రయంలో ఇంగ్లండ్ క్రికెటర్లు..
🚨 England Cricket Team have Reached India for the 5 T20s and 3 ODIs.#INDvsENG pic.twitter.com/OPoiem5GYg
— Sheeza Khan (@Pmln_gulf92) January 18, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..