IND vs SL: ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మైదానంలో తిట్టుకున్న శ్రీలంక కోచ్, కెప్టెన్..! వైరలవుతోన్న వీడియో..
మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది. ఓటమి నుంచి తప్పుకుని విజయం సాధించింది.
IND vs SL: శిఖర్ ధావన్ నాయకత్వంలోని యంగ్ టీమిండియా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-0 తో మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. మంగళవారం ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన రెండవ వన్డేలో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట సూర్యకుమార్ యాదవ్, చివర్లో దీపక్ చాహర్ అర్థసెంచరీలతో ఆడి విజయాన్ని అందించారు. అయితే, శ్రీలంక జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని అసహనం ప్రదర్శించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తరువాత లంక కెప్టెన్ దసున్ షనకతో మైదానంలో గొడవపడ్డాడు. ఈ మేరకు క్రిక్ ఫన్ వీడియోలో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ వివాదంపై శ్రీలంక మాజీ లెజెండ్ రస్సెల్ ఆర్నాల్డ్ కోచ్ ప్రవర్తనపై మండిపడ్డాడు. ఈమేరకు ‘కోచ్, కెప్టెన్‌ల మధ్య గొడవ మైదానంలో కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో జరగాల్సిందని’ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో దసున్ షనక, మిక్కీ ఆర్థర్ గొడవ పడడం చూడొచ్చు. కోపంగా, గట్టిగా మాట్లాడుతున్నారు. ఇంతలో కోచ్ ఆర్థర్ కోపంగా వేలు చూపిస్తూ.. మైదానం బయటకు వెళ్లడం చూడొచ్చు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అసలంక 65 (6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో 50 (4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక చివర్లో కరుణరత్నే 44 నాటౌట్ (33 బంతులు, 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో చహల్ 3, భువనేశ్వర్ 3, దీపక్ చహర్ 2 వికెట్లు పడగొట్టారు. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.1 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి విజయం సాధించింది. దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరి వన్డే ఈనెల 23న జరగనుంది.
— cric fun (@cric12222) July 20, 2021
Also Read:
Rahul Dravid: కోచ్ ద్రవిడ్ టెన్షన్ మాములుగా లేదుగా.. చేజారితే పరిస్థితి మరోలా ఉండేదేమో!
TNPL 2021: డెబ్యూ మ్యాచ్‌లో 19 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సిక్సర్లు, ఫోర్లతో 202 స్ట్రైక్‌రేట్.!