ఇతడి వల్లే ఇంగ్లండ్ రికార్డ్ స్కోర్.. మాములు బ్యాట్స్‌మెన్ కాదు కదా..! ఆసీస్ బౌలర్లను ఇరగదీశాడు

On This Day In Cricket: వన్డే చరిత్రలో భారీ స్కోర్‌ను ఇంగ్లండ్ నమోదు చేసింది. ఆ తరువాత కూడా ఏ జట్టు ఇంత భారీ స్కోర్‌ను నమోదు చేయలేదు.

ఇతడి వల్లే ఇంగ్లండ్ రికార్డ్ స్కోర్.. మాములు బ్యాట్స్‌మెన్ కాదు కదా..! ఆసీస్ బౌలర్లను ఇరగదీశాడు
Jason Roy

On This Day In Cricket: వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు బలమైన జట్టే. ఎలాంటి సందేహం లేదు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించిన ఓ ఆటగాడు కూడా ఇంగ్లండ్ టీంలో ఉన్నాడు. నేడు(జులై 21) తన పుట్టిన రోజు. వన్డే క్రికెట్ చరిత్రలో భారీ స్కోరు సాధించేందుకు తన వంతు సహాయం కూడా అందించాడు. ఆయనే ఓపెనర్ జాసన్ రాయ్. జాసన్ నుంచి అందిన సునామీ లాంటి ఇన్నింగ్స్‌తో 481 పరుగులు సాధించింది. 21 జులై 1990 న జన్మించిన జాసన్ రాయ్.. 19 జూన్ 2018 న నాటింగ్‌హామ్‌లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ జట్టు తలపడింది. ఓపెనర్‌గా వచ్చిన జాసన్ రాయ్ మంచి ఆరంభం అందించాడు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 481 పరుగులు చేసింది. జాసన్ 61 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం రనౌట్‌గా వెనుదిరిగాడు. జాసన్ తోటి ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 92 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 139 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన అలెక్స్ హేల్స్ 92 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 147 పరుగులు చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 30 బంతుల్లో 67 పరుగులు బాదేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

జాసన్ 5 టెస్టులు, 98 వన్డేలు, 47 టీ20లు ఆడాడు..
ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఎనిమిది మంది బౌలర్లను ఉపయోగించుకుంది. ఆండ్రూ టై 9 ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకున్నాడు. రిచర్డ్సన్ పది ఓవర్లలో 92 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు తీశాడు. మార్కస్ స్టోయినిస్ 8 ఓవర్లలో 85 పరుగులు సమర్పించుకున్నాడు. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు కేవలం 239 పరుగులకు చేతులెత్తేసింది. ఆసీస్ జట్టులో ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. ట్రావిస్ హెడ్ 39 బంతుల్లో 51 పరుగులు చేశాడు. వీరితో పాటు స్టోయినిస్ 44, అష్టన్ అగర్ 25 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ తరఫున ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మొయిన్ అలీ మూడు వికెట్లు తీశాడు. డేవిడ్ విల్లీ ఖాతాలో రెండు వికెట్లు చేరాయి. జాసన్ ఇంగ్లాండ్ తరఫున 5 టెస్టుల్లో 18.70 సగటుతో 187 పరుగులు చేశాడు. 98 వన్డేల్లో 40.19 సగటుతో 3658 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. జాసన్ 47 టీ 20 ల్లో 24.02 సగటుతో 1129 పరుగులు చేశాడు.

Also Read:

IND vs SL: ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మైదానంలో తిట్టుకున్న శ్రీలంక కోచ్, కెప్టెన్..! వైరలవుతోన్న వీడియో..

India vs Sri Lanka 2021: 2017 సీన్ రిపీట్.. అదే జట్టు, అదే టెన్షన్.. ప్లేయర్లు మాత్రం ఛేంజ్