Rahul Dravid: కోచ్ ద్రవిడ్ టెన్షన్ మాములుగా లేదుగా.. చేజారితే పరిస్థితి మరోలా ఉండేదేమో!
రెండో వన్డేలో టీమిండియా కుర్రాడు దీపక్ చహర్ అదరగొట్టాడు. సూపర్బ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించాడు. పరాజయం తప్పదనుకున్న మ్యాచులో చెలరేగి ఆడి.. టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.
India vs Srilanka: రెండో వన్డేలో టీమిండియా కుర్రాడు దీపక్ చహర్ అదరగొట్టాడు. సూపర్బ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించాడు. పరాజయం తప్పదనుకున్న మ్యాచులో చెలరేగి ఆడి.. టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. మూడు వన్డేలో సిరీస్‌లో మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా 2-0తేడాతో దక్కించుకుంది. భువనేశ్వర్‌తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. గత మ్యాచులో విఫలమైన భువనేశ్వర్ రెండో వన్డేలో చెలరేగాడు. మూడు వికెట్లు తీసి ఫామ్‌లోకి వచ్చాడు. బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసిన దీపక్ చహర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఈమేరకు భువనేశ్వర్ మాట్లాడుతూ, ”ఓ అద్భుతమైన మ్యాచ్‌లో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. దీపక్ చహర్ సూపర్ ఇన్నింగ్స్ టీమిండియాను నిలబెట్టింది. నా వరకు కీలక సమయంలో మరో వికెట్ పడకుండా దీపక్‌కు సహకరించాను. ఇక మా కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా సంతోషంగా ఉంటారనుకుంటున్నా. ఎందుకంటే మ్యాచ్ సమయంలో ద్రవిడ్ టెన్షన్‌కు గురైనట్లు కనిపించింది. ముఖ్యంగా దీపక్ చహర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని సోదరుడు రాహుల్ చహర్‌తో పదే పదే మాట్లాడుతున్నాడు. చాలాసేపు అటు ఇటు తిరగుతూ కనిపించాడు. ఒకవేళ మ్యాచ్ చేజారి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. గెలిచిన తరువాత ద్రవిడ్ కూల్‌గా మారిపోయారు. ఇక క్లీన్ స్వీప్‌పై దృష్టి పెట్టాం” అంటూ పేర్కొన్నాడు. టీమిండియా.. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో తొలి అంతర్జాతీయ సిరీస్ గెలిచింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అసలంక 65 (6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో 50 (4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక చివర్లో కరుణరత్నే 44 నాటౌట్ (33 బంతులు, 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో చహల్ 3, భువనేశ్వర్ 3, దీపక్ చహర్ 2 వికెట్లు పడగొట్టారు. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.1 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి విజయం సాధించింది. దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరి వన్డే ఈనెల 23న జరగనుంది.
ఆరేళ్ల తరువాత నోబాల్.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో భువనేశ్వర్ నోబాల్ వేశాడు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత భువీ నోబాల్ వేయడం గమనార్హం. 2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరిసారిగా నోబాల్ వేసిన భువీ.. 3093 బంతుల తర్వాత తిరిగి నోబాల్ వేశాడు. మొత్తంగా ఈ టీమిండియా పేసర్ అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 5 నోబాల్స్ మాత్రమే వేయడం విశేషం.
No words just Dravid
India won the series ????#INDvSL #RahulDravid pic.twitter.com/KaQQVO9eHJ
— Joe Selva (@joe_selva1) July 20, 2021
Also Read:
TNPL 2021: డెబ్యూ మ్యాచ్‌లో 19 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సిక్సర్లు, ఫోర్లతో 202 స్ట్రైక్‌రేట్.!
Viral Video: ఛారిటీ మ్యాచ్ అన్నారు.. బ్యాట్‌లతో బాదుకున్నారు..!
Tokyo Olympics 2021: బోపన్నపై వేటు పడనుందా.. మరింత ముదిరిన ఐటా వివాదం.. డేవిస్ కప్‌లో డౌటే?