Tokyo Olympics 2021: బోపన్నపై వేటు పడనుందా.. మరింత ముదిరిన ఐటా వివాదం.. డేవిస్‌ కప్‌లో డౌటే?

అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా), రోహన్‌ బోపన్నల వివాదం ముదురుతోంది. సుమిత్‌ నాగ్‌పాల్‌ జోడీగా ఒలింపిక్స్‌లో ఆడేందుకు తనకు అర్హత లభించిందని ఐటా తప్పుదోవ పట్టించిందని బోపన్న మండిపడడం తెలిసిందే.

Tokyo Olympics 2021: బోపన్నపై వేటు పడనుందా.. మరింత ముదిరిన ఐటా వివాదం.. డేవిస్‌ కప్‌లో డౌటే?
Bopanna Aita Issue
Follow us
Venkata Chari

|

Updated on: Jul 21, 2021 | 6:52 AM

Rohan Bopanna: అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా), రోహన్‌ బోపన్నల వివాదం ముదురుతోంది. సుమిత్‌ నాగ్‌పాల్‌ జోడీగా ఒలింపిక్స్‌లో ఆడేందుకు తనకు అర్హత లభించిందని ఐటా తప్పుదోవ పట్టించిందని బోపన్న మండిపడడం తెలిసిందే. ఈమేరకు అర్హత నిబంధనలు తెలుసుకోవాలంటూ ఐటా ఘటుగా మాట్లాడడం తెలిసిందే. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే బోపన్నకు తోడు సానియా మద్దతు తెలపడం కూడా చర్చనీయాశం అయింది. అయితే, తాజాగా ఈ మేరకు తన ఆరోపణలకు బలం చేకూర్చేలా బోపన్న ఓ కాల్‌ రికార్డింగ్‌ వీడియోను బయటపెట్టాడు. డబుల్స్‌లో బోపన్న-సుమిత్‌ ఎంట్రీ దరఖాస్తును ఐటీఎఫ్‌ అంగీకరించిందని ఐటా కార్యదర్శి అనిల్‌ ధూపర్‌ కాల్ మాట్లాడుతున్నట్లు అందులో ఉంది. అయితే కానీ, బోపన్న కాల్‌ రికార్డును ట్విట్టర్లో షేర్ చేయడాన్ని ఐటా తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఈమేరకు బోపన్న చర్యను ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు ధూపర్‌ పేర్కొన్నాడు.

ఈమేరకు ఆయన మాట్లాడుతూ, ‘కాల్‌ రికార్డు చేసి ట్విట్టర్లో షేర్ చేయడం అస్సలు మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని మేనేజింగ్‌ కమిటీ, ఎథిక్స్‌ కమిటీకి నివేదిస్తాం’’ అని ఆయన తెలిపాడు. అయితే, భారత డేవిస్‌కప్‌ జట్టు ఎంపికలో బోపన్నపై వేటు పడనుందా అనే ఓ విలేకరి అడిగినప్పుడు.. ‘ప్రస్తుతానికైతే ఏం చెప్పలేం. బోపన్నపై చర్యలు తీసుకోవాలని కమిటీ భావిస్తే.. అతడి పేరును సెలక్షన్‌ కమిటీకి పంపబోం’’ అని తెలిపాడు. ఈ వివాదం మరింత ముదిరి ఏ స్థాయి వరకు వెళ్లనుందో చూడాలి. బోపన్న 38వ ర్యాంకులో ఉండగా, దివిజ్‌ శరణ్‌ 75వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. వీరిద్దిరి ర్యాంకులు కలిపి 113 ఉండడంతో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయాడు.

Also Read:

IND vs SL 2nd ODI: రెండో వన్డేలోనూ టీమిండియా హవా.. మూడు వికెట్ల తేడాతో విజయం.. ఒంటి చేత్తో గెలిపించిన దీపక్‌ చాహర్‌.

IND vs SL 2nd ODI : గబ్బర్ సేన లక్ష్యం 276 పరుగులు.. చివరలో చెలరేగిన కరుణరత్నే

Tokyo Olympics 2021: మహిళలదే పైచేయి.. అగ్రదేశాల నుంచి పోటీల్లో వీరిదే తొలిస్థానం.. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి!