IND vs SL 2nd ODI: రెండో వన్డేలోనూ టీమిండియా హవా.. మూడు వికెట్ల తేడాతో విజయం.. ఒంటి చేత్తో గెలిపించిన దీపక్‌ చాహర్‌.

IND vs SL 2nd ODI: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలను గెలిచి సిరీస్‌ నెగ్గింది. దీంతో ఇంకో వన్డే మిగిలి ఉండగానే...

IND vs SL 2nd ODI: రెండో వన్డేలోనూ టీమిండియా హవా.. మూడు వికెట్ల తేడాతో విజయం.. ఒంటి చేత్తో గెలిపించిన దీపక్‌ చాహర్‌.
India Won The Match
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 20, 2021 | 11:40 PM

IND vs SL 2nd ODI: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలను గెలిచి సిరీస్‌ నెగ్గింది. దీంతో ఇంకో వన్డే మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను దక్కించుకుంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ విజయ కేతనం ఎగరేసింది. అంతకు ముందు 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఒకానొక సమయంలో 193 పరుగులకే 7 కీల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్‌ ఓటమి దిశగా వెళుతోందా అని అనుమానాలు వచ్చిన సమయంలో క్రీజులోకి వచ్చిన దీపక్‌ చాహర్‌ రాణించాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. భువనేశ్వర్‌ మంచి భాగస్వామ్యం ఇవ్వడంతో చాహర్‌ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. 69 పరుగులతో దీపక్‌ చాహర్‌, 19 పరుగులతో భువనేశ్వర్‌ రాణించడంతో భారత్‌ విజయం ఖాయమైంది.

ఇక అంతకు ముందు 50 ఓవర్లలో లంక 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అసలంక 65 పరుగులు, అవిష్క ఫెర్నాండో 50 పరుగులు అర్ధ శతాకాలతో రాణించారు. చివరలో కరుణరత్నె చెలరేగిపోయాడు. 44 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ 11పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. టీమిండియా బౌలర్లలో భువీ, చహల్‌ తలో మూడు వికెట్లు, చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టగా ఒకరు రనౌట్‌గా వెనుదిరిగారు.

Also Read: Peddi Reddy : ‘జగనన్న పచ్చ తోరణం’లో అనుకున్న ప్రగతి సాధించలేకపోయామన్న పెద్దిరెడ్డి

Smart Saving Account: ఈ బ్యాంక్ అకౌంట్‌తో అధిక వడ్డీ.. తీసుకోవడం కూడా చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..

AP Special Status : ప్రత్యేక హోదాపై రాజ్యసభ స్తంభన.. ప్లకార్డ్‌లతో పోడియం వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన