Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: మహిళలదే పైచేయి.. అగ్రదేశాల నుంచి పోటీల్లో వీరిదే తొలిస్థానం.. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి!

టోక్యో ఒలింపిక్ క్రీడలు ప్రారంభించడానికి మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆటల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వెటరన్ ఆటగాళ్లు జపాన్ రాజధానికి చేరుకుంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ కోసం భారత ఆటగాళ్లు కూడా చేరుకున్నారు. శిక్షణ కూడా మొదలుపెట్టారు.

Tokyo Olympics 2021: మహిళలదే పైచేయి.. అగ్రదేశాల నుంచి పోటీల్లో వీరిదే తొలిస్థానం.. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి!
Female Athletes In Olympics
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 2:12 PM

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్ క్రీడలు ప్రారంభించడానికి మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆటల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వెటరన్ ఆటగాళ్లు జపాన్ రాజధానికి చేరుకుంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020 కోసం భారత ఆటగాళ్లు కూడా చేరుకున్నారు. శిక్షణ కూడా మొదలుపెట్టారు. తాజా ఒలింపిక్స్‌ను పరిశీలిస్తే.. టోక్యో ఒలింపిక్స్‌ తొలిసారి ఓ రికార్డును సాధించింది. అత్యధికంగా మహిళా అథ్లెట్లు పాల్గొన్న ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నారు. ఐదు అగ్ర దేశాలను ఓసారి పరిశీలిస్తే.. పురుషుల కంటే ఫిమేల్ అథ్లెట్లు ఎక్కువమంది టోక్యోలో సందడి చేయబోతున్నారు. యూఎస్‌, చైనా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనాడా దేశాలు మహిళా అథ్లెట్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా మిగతా దేశాలు కూడా పురుషులతో సమానంగా ఈ పోటలకు పంపనున్నాయి. చైనా నుంచి 298 మంది మహిళా అథ్లెట్లు..133 మంది పురుషులు పాల్గొంటున్నారు. అగ్రదేశం అమెరికా నుంచి 329 మంది మహిళలు, 284 మంది పురుషులు సత్తా చాటేందుకు రాబోతున్నారు. అలాగే యూకే నుంచి 201 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. ఈ దేశం నుంచి 376 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. మరో దేశం కెనడా నుంచి 225 మంది మహిళలు, 145 మంది పురుషులను పంపిస్తోంది. ఆస్ట్రేలియా నుంచి 252 మంది మహిళలు, 219 మంది పురుషులు పతకాల కోసం పోటీపడనున్నారు. రష్యా నుంచి 183 మంది మహిళలు, 146 మంది పురుషులు రంగంలోకి దిగనున్నారు. ఇక మనదేశం నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొంటుండగా, 56 మంది మహిళలు ఉన్నారు. ఆతిథ్య జపాన్‌ నుంచి 259 మహిళలు, 293 పురుషులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు.

ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ఐవోసీ అధికారికంగానే టోక్యో ఒలింపిక్స్‌ను లింగ సమానత్వం పాటించనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు ప్రారంభ వేడుకల్లో పతాకధారులనుంచి క్రీడలు ముగిసేవరకు మహిళలను పురుషులతో సమానంగా చేర్చారు. ఈ సారి ఒలింపిక్స్‌లో మొత్తం 48.8 శాతం మహిళా అథ్లెట్లు తమ సత్తా చాటనున్నారు. అయితే ఐఓసీ అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. చరిత్రను ఓ సారి పరిశీలిస్తే..1896లో జరిగిన ఆధునిక మొదటి ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ మహిళలను నిషేధించారు. 1900 ప్యారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి మహిళా అథ్లెట్లకు అనుమతి లభించింది. మహిళలు పాల్గొన్న తొలి పోటీల్లో మొత్తం 997 మంది అథ్లెట్లు పాల్గొంటే 22 మంది మాత్రమే మహిళలు ఐదు విభాగాల్లో పాల్గొన్నారు.

Also Read:

Tokyo Olympics 2021: కార్డ్‌బోర్డ్‌ బెడ్స్‌పై వస్తోన్న వార్తలు అవాస్తవం.. నిరూపించిన ఐరిష్ జిమ్నాస్ట్! ధన్యవాదాలు తెలిపిన ఐఓసీ

Tokyo Olympics 2021: బోపన్న, సానియా.. ఐటీఎఫ్‌ రూల్స్‌ పుస్తకాన్ని ఓసారి చదవండంటూ ఐటా ఫైర్; ముదురుతున్న వివాదం!