AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: కార్డ్‌బోర్డ్‌ బెడ్స్‌పై వస్తోన్న వార్తలు అవాస్తవం.. నిరూపించిన ఐరిష్ జిమ్నాస్ట్! ధన్యవాదాలు తెలిపిన ఐఓసీ

మరో మూడు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు పలు దేశాల ఆటగాళ్లు ఒలింపిక్ క్రీడా గ్రామం చేరుకుంటున్నారు. ఈ నేపత్యంలో అక్కడ ఏర్పాటు చేసిన బెడ్స్‌పై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Tokyo Olympics 2021: కార్డ్‌బోర్డ్‌ బెడ్స్‌పై వస్తోన్న వార్తలు అవాస్తవం.. నిరూపించిన ఐరిష్ జిమ్నాస్ట్! ధన్యవాదాలు తెలిపిన ఐఓసీ
Anti Sex Beds
Venkata Chari
|

Updated on: Jul 20, 2021 | 1:33 PM

Share

Tokyo Olympics 2021: మరో మూడు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు పలు దేశాల ఆటగాళ్లు ఒలింపిక్ క్రీడా గ్రామం చేరుకుంటున్నారు. ఈ నేపత్యంలో అక్కడ ఏర్పాటు చేసిన బెడ్స్‌పై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వీటిపై స్పందించిన నిర్వాహకులు ఆ వార్తలున్నీ అవాస్తవమని తేల్చి చెప్పారు. కేవలం పర్యావరణ హితంగా కార్డ్ బోర్డ ఉపయోగించి వీటిని తయారు చేశామని పేర్కొన్నారు. కాగా, ఒలింపిక్ విలేజ్‌లోని బెడ్స్ ఉత్తవేని, త్వరగా విరిగిపోతాయని, అలాగే అథ్లెట్లు శారీరకంగా కలవకుండా ఏర్పాటు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, బెడ్స్ పటిష్టతను ఐరిష్ జిమ్నాస్ట్ మెక్‌ క్లెంగన్ నిరూపించాడు. ఈమేరకు బెడ్‌పై నుంచి పదేపదే దూకుతూ ఓ వీడియోను షూట్ చేశాడు. ఈ బెడ్స్ చాలా బలంగా ఉన్నాయంటూ తేల్చి చెప్పాడు. దీంతో ఈ వీడియోను ఐఓసీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ‘బెడ్స్ కార్డ్‌బోర్డ్‌తో తయారుచేసినవే. చాలా బలంగా కూడా ఉన్నాయి. అథ్లెట్లు శారీరకంగా కలవకుండా ఈ బెడ్స్ ఏర్పాటు చేశారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయిందని’ ట్విట్టర్లో పేర్కొంది. అలాగే ఐరిష్ జిమ్నాస్ట్ మెక్‌లాంగన్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.

మరోవైపు ఈ బెడ్స్‌పై సందేహాలు రావడం ఇదేం మొదటిసారి కాదు. జనవరిలో ఆస్ట్రేలియా బాస్కెట్‌బాల్ ఆటగాడు ఆండ్రూ బోగట్ వీటి పటిష్టతపై అనుమానాలు వ్యక్తం చేశాడు. దీనికి ఎయిర్ వేవ్ సంస్థ స్పందించి.. 200 కిలోల బరువును తట్టుకోగలవని సమాధానం ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అలాగే క్రీడా గ్రామంలోకి అథ్లెట్లు ఎంటర్ అయ్యాక నిన్నటి నుంచి ఈ బెడ్స్‌పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఇలాంటి వార్తలన్నీ నిరాధారమని వెల్లడైంది.

ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్ల తొలి విడతగా ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌కు చెందిన 88 సభ్యుల బృందంలో 54 మంది అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది, ఐఓఏ ప్రతినిధి వెళ్లారు. ఇక తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పీవీ సింధు, సాయి ప్రణీత్‌, సాత్విక్‌ సాయిరాజ్ కూడా శనివారం టోక్యో వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ ఒలింపిక్స్‌కు భారత్‌ మొత్తం 228 సభ్యులను పంపిస్తోంది. ఇందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారు. భారత రోయింగ్‌, షూటింగ్‌ జట్లు ఇప్పటికే టోక్యో చేరుకున్న సంగతి తెలిసిందే. ఇటలీ నుంచి బయల్దేరిన బాక్సింగ్‌ బృందం ఆదివారం చేరుకుంది. భారత్‌ నుంచి నలుగురు సెయిలర్లతో కూడిన బృందం టోక్యోలో అడుగుపెట్టింది. గురువారమే సెయిలర్లు టోక్యో చేరుకున్నారు. అథ్లెట్లకు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా, సెక్రటరీ రాజీవ్ మోహతా, సాయ్ డైరెక్టర్ సందీప్ ప్రధాన్ సెండాఫ్ ఇచ్చిన వారిలో ఉన్నారు.

Also Read:

Tokyo Olympics 2021: బోపన్న, సానియా.. ఐటీఎఫ్‌ రూల్స్‌ పుస్తకాన్ని ఓసారి చదవండంటూ ఐటా ఫైర్; ముదురుతున్న వివాదం!

Tokyo Olympics 2021: మరో కోవిడ్ కేసు నమోదు.. ఒలింపిక్ విలేజ్‌లో 58కి చేరిన సంఖ్య.. భయాందోళనలో అథ్లెట్లు!

Follow Us
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో