Tokyo Olympics 2021: మరో కోవిడ్ కేసు నమోదు.. ఒలింపిక్ విలేజ్‌లో 58కి చేరిన సంఖ్య.. భయాందోళనలో అథ్లెట్లు!

మరో మూడు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌‌ మొదలుకానుంది. ఇప్పటికే ఒలింపిక్‌ క్రీడా గ్రామానికి అథ్లెట్లు చేరుకుంటున్నారు. భారత్ నుంచి మొదటి విడతగా కొంతమంది ప్లేయర్లు టోక్యో చేరుకుని, ప్రాక్టీస్‌లో మునిగిపోయారు.

Tokyo Olympics 2021: మరో కోవిడ్ కేసు నమోదు.. ఒలింపిక్ విలేజ్‌లో 58కి చేరిన సంఖ్య.. భయాందోళనలో అథ్లెట్లు!
Follow us

|

Updated on: Jul 20, 2021 | 11:47 AM

Tokyo Olympics 2021: మరో మూడు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌‌ మొదలుకానుంది. ఇప్పటికే ఒలింపిక్‌ క్రీడా గ్రామానికి అథ్లెట్లు చేరుకుంటున్నారు. భారత్ నుంచి మొదటి విడతగా కొంతమంది ప్లేయర్లు టోక్యో చేరుకుని, ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. అయితే, రోజురోజుకో కరోనా కేసు బయటడడంతో ఒలింపిక్ క్రీడా గ్రామంలో భయాందోళనలు కలిగిస్తోంది. కరోనా కట్టడికి ఎన్నో చర్యలు తీసుకున్నా.. కేసులు పెరుగుతుండడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు విశ్వక్రీడల నిర్వహణపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 58 మంది కరోనా బారిన పడినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయినా ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు సాగుతోంది ఒలింపిక్ సంఘం. ఆదివారం ఇద్దరు సౌతాఫ్రికా ఫుట్‌బాల్‌ టీమ్‌ ఆటగాళ్లు తబిసో మోనియాని, కామొహెలో మాహ్‌లాస్తి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బీచ్‌ వాలీబాల్‌ ప్లేయర్‌ ఒండ్రెజ్‌ పెరుసిక్‌కు కోవిడ్ సోకినట్లు పేర్కొంది. దీంతో మొత్తం ముగ్గురు ఒలింపిక్స్‌ క్రీడాకారులు కోవిడ్ బారిన పడ్డారు.

ఇప్పటివరకు మొత్తం 58 మంది వ్యక్తులకు కరోనా సోకడంతో.. అథ్లెట్లలో భయాందోళనలు నెలకొన్నాయి. కఠిన నిబంధనలు పాటించినా వారు వైరస్‌ బారిన పడ్డాడని ఆ దేశ ఒలింపిక్స్‌ కమిటి పేర్కొంది. ప్రస్తుతం వీరికి లక్షణాలేవీ కనిపించలేదని, ఈమేరకు ఓ హోటల్‌లో ఐసోలేషన్‌ ఉంచినట్లు తెలిపింది. ఇక జులై 26న పెరుసిక్‌ జ్ఞ తొలి మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితితో అతడి మ్యాచ్‌ను వాయిదా వేయాలని చెక్‌ రిపబ్లిక్‌ ఒలింపిక్స్‌ కమిటి కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఆదివారం ఒక్కరోజే క్రీడా గ్రామంలో 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో దక్షిణాఫ్రికాకు చెందిన వారు నలుగురు కాగా… క్రీడా గ్రామ సిబ్బందిలో మరో ఆరుగురున్నారు. అయితే, క్రీడా గ్రామంలో భారత బృందం ఉన్న టవర్‌ 15లోనే దక్షిణాఫ్రికా టీమ్‌ కూడా బస చేసింది. ముందుముందు ఎన్ని కేసులు బయటపడతాయో చూడాలి.

Also Read:

21 భవనాలు.. 18 అంతస్తులు.. మూడు వైపులా సముద్రం.. రూ. 36 బిలియన్లతో ఒలింపిక్ విలేజ్ నిర్మాణం..!

India Vs Srilanka: వన్డే సిరీస్‌పై కన్నేసిన గబ్బర్ సేన.. టీంలో నో ఛేంజ్‌స్.. ఆ ఇద్దరూ బెంచ్‌కే!

గోల్డెన్ హ్యాట్రిక్‌తో ఒలింపిక్ బరిలోకి ఇండియన్ ఆర్చర్.. తొలి పతకంపై కన్నేసిన దీపిక కుమారి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!