Viral Video: ఛారిటీ మ్యాచ్‌ అన్నారు.. బ్యాట్‌లతో బాదుకున్నారు..!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే లేదు. రోజుకు బోలెడన్ని వీడియోలు నెట్టింట్లో అప్‌లోడ్ అవుతూ నెటిజన్లను అలరిస్తున్నాయి. తాజాగా ఛారిటీ మ్యాచ్ అంటూ బరిలోకి దిగిన క్రికెటర్లు.. బ్యాట్‌లతో తన్నుకున్నారు.

Viral Video: ఛారిటీ మ్యాచ్‌ అన్నారు.. బ్యాట్‌లతో బాదుకున్నారు..!
Mote Park Cricket Club Charity Match
Follow us

|

Updated on: Jul 21, 2021 | 8:17 AM

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే లేదు. రోజుకు బోలెడన్ని వీడియోలు నెట్టింట్లో అప్‌లోడ్ అవుతూ నెటిజన్లను అలరిస్తున్నాయి. తాజాగా ఛారిటీ మ్యాచ్ అంటూ బరిలోకి దిగిన క్రికెటర్లు.. బ్యాట్‌లతో తన్నుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య వివాదాలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే, అంపైర్లు, తోటి ఆటగాళ్లు ఎంటరై గొడవలను సద్దుమణిగిస్తుంటారు. కానీ, ఈ గొడవలో మాత్రం అలా జరగలేదు. వివాదం ఫీక్స్‌కి చేరడంతో బ్యాట్‌‌లతో బాదేసుకున్నారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ ఛారిటి మ్యాచులో జరిగింది ఈ తంతు. షెహజాద్ అక్రమ్ ఆధ్వర్యంలో పాక్‌లోని పేదలకు వైద్యం చేసేందుకు ఇంగ్లండ్‌లో ఓ ఛారిటీ మ్యాచ్‌ నిర్వహించారు. మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్ చివరికి రక్తపాతంతో ముగియడంతో.. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు.

అయితే, అసలు గొడవకి కారణమైతే తెలియలేదు. మొదట బ్యాట్స్‌మెన్ ఓ ఫీల్డర్‌పై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. దాంతో వివాదం చినికి చినికి గాలివానలా తయారైంది. రెండు టీలం ఆటగాళ్లు ఆవేశం ఆపుకోలేక బ్యాట్‌లతో దాడి చేసుకోవడం వీడియోలో చూడోచ్చు. గొడమ మధ్యలో అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు ఎంటరై, సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆటగాళ్లు ఆగలేదు. ఇందులో ఇద్దరు ఆటగాళ్లు దెబ్బలకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయారంట.

ఈ మేరకు షెహజాద్ అక్రమ్ స్పందిచాడు. ‘రెండు ఓవర్లు అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌ ముగిసిపోయేది. ఇంతలో కొందరు గ్రౌండ్‌లోకి ఎంటరై వివాదాన్ని షురూ చేశారు. కారణం మాత్రం తెలియదు. బ్యాట్‌లతో ఆటగాళ్లని తీవ్రంగా కొట్టారు. ఛారిటీ మ్యాచ్ ఉద్దేశాన్ని చెడగొట్టారు’ అని ఆయన వాపోయాడు.

Also Read:

ICC Rankings: 16 ఏళ్లలో తొమ్మిదోసారి.. మిథాలీ రాజ్ ‘టాప్’ గేర్!

Tokyo Olympics 2021: బోపన్నపై వేటు పడనుందా.. మరింత ముదిరిన ఐటా వివాదం.. డేవిస్‌ కప్‌లో డౌటే?

IND vs SL 2nd ODI: రెండో వన్డేలోనూ టీమిండియా హవా.. మూడు వికెట్ల తేడాతో విజయం.. ఒంటి చేత్తో గెలిపించిన దీపక్‌ చాహర్‌.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?