TNPL 2021: డెబ్యూ మ్యాచ్‌లో 19 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సిక్సర్లు, ఫోర్లతో 202 స్ట్రైక్‌రేట్.!
కరోనా సెకండ్ వేవ్ అనంతరం దేశంలో డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్లు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. వాయిదాపడిన ఐపీఎల్ సెకండాఫ్ సెప్టెంబర్‌లో..
కరోనా సెకండ్ వేవ్ అనంతరం దేశంలో డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్లు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. వాయిదాపడిన ఐపీఎల్ సెకండాఫ్ సెప్టెంబర్‌లో జరగనుండగా.. జూలై 19 నుంచి తమిళనాడు ప్రీమియర్ లీగ్ షూరూ అయింది. ఇక టోర్నీ మొదలైన తొలి రోజే ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల కుర్రాడు తన డెబ్యూ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ రసవత్తరమైన మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారడంతో ఫలితం లేకుండానే చివరికి రద్దైంది. లైకా కోవై కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 19 ఏళ్ల సాయి సుదర్శన్ 202 స్ట్రైక్ రేట్‌తో 43 బంతుల్లో 87 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లు ఉన్నాయి.
టాస్ గెలిచిన సేలం జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోగా.. లైకా కోవై కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు గంగా శ్రీధర్ రాజు(33), ఆర్ కవిన్(33) కోవై జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ పడగానే క్రీజులోకి వచ్చిన సుదర్శన్.. ఫస్ట్ నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తిస్తూ 24 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అలా మొత్తం 43 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 17వ ఓవర్‌లో జట్టు స్కోర్ 159 పరుగులు ఉన్నప్పుడు పెవిలియన్‌కు చేరాడు. అయితే ఆ తర్వాత వర్షం పడటంతో.. మ్యాచ్ మళ్లీ మొదలుకాలేదు. అంపైర్లు పూర్తిగా రద్దు చేశారు. కాగా, సాయి సుదర్శన్ 15 సంవత్సరాల వయసులో టిఎన్‌పిఎల్‌లో చేరాడు, కాని అతడు ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశాడు. ఈ సీజన్‌కు ముందు, అతను చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Sai Sudarshan – 8️⃣7️⃣(4⃣3⃣)?
From JSK to LKK, the paw prints are going strong! ?#TNPL #WhistlePodu #Yellove ?? ? – @TNPremierLeague pic.twitter.com/w6qjeNTEXf
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) July 19, 2021
Also Read:
మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..
పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!