AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..

Dont Keep These Thing In Purse: కొంతమంది దేవుళ్ల ఫోటోలను సైతం వాలెట్‌లో పెట్టుకుంటారు. అలా ఉంచుకోవడం వల్ల ధనలాభం వస్తుందని వారి నమ్మకం.

Astrology: మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..
Purse
Ravi Kiran
|

Updated on: Jul 20, 2021 | 6:53 PM

Share

డబ్బులు దాచుకోవడానికే కాకుండా.. ఏవైనా ముఖ్యమైన పేపర్స్ లేదా బ్యాంక్ కార్డులు, ఇతరత్రా డాక్యుమెంట్స్‌కు కూడా పర్స్‌లను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొంతమంది దేవుళ్ల ఫోటోలను సైతం వాలెట్‌లో పెట్టుకుంటారు. అలా ఉంచుకోవడం వల్ల ధనలాభం వస్తుందని వారి నమ్మకం. అయితే దేవుళ్ల ఫోటోలను పర్స్‌లో అస్సలు పెట్టుకోకూడదు. ఈరోజు మనం వాలెట్‌లో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి.? మన పర్స్‌లో డబ్బు నిలవాలంటే ఏం చేయాలో.? జోతిష్యశాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.!

దేవుళ్ల ఫోటోలను వాలెట్‌లో ఉంచవద్దు…

మీ పర్స్‌లో డబ్బుతో పాటు వేస్ట్ పేపర్స్‌ను ఎప్పుడూ వాలెట్‌లో ఉంచకూడదు. అంతేకాకుండా దేవుళ్ల ఫోటోలు, చనిపోయిన బంధువుల చిత్రాలు పర్సులో పెట్టుకోవద్దు. అలాంటివి పెట్టుకోవడం ద్వారా మీకు ఆర్ధిక సమస్యలు తలెత్తవచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, మీరు మీ పర్స్‌లో ఓం లేదా స్వస్తిక్ చిహ్నంకు సంబంధించిన ఫోటోలు పెట్టుకోవచ్చు. అయితే ఓం, స్వస్తిక్ చిహ్నాల చిత్రాలను మ్యుటిలేట్ చేయకూడదని ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ వాలెట్ డబ్బును భద్రపరిచేది మాత్రమే కాదు.. లక్ష్మీదేవి ఉండే చోటు కూడా.. అందుకే అది ఎలప్పుడూ శుభ్రంగా ఉండాలి.

డబ్బు సంబంధిత సమస్యలకు దూరంగా ఉండాలంటే చేయండిలా..

మ్యుటిలేటెడ్, పాత పేపర్లు, బిల్లులు మొదలైనవి పర్సులో ఉంచడం వల్ల అప్పు పెరుగుతుంది. కాబట్టి డబ్బు తప్ప మరేది కూడా వాలెట్‌లో ఉంచకండి. డబ్బును ఎప్పుడూ పర్సులో మడిచిపెట్టకండి. అలాగే మురికి చేతులతో పర్సును తాకకూడదు. బ్లేడ్లు, చిన్న కత్తులు వంటి పదునైన వస్తువులను కూడా పర్సులో పెట్టుకోవద్దు. ఇవే కాకుండా, నోట్లు, నాణేలను ఎప్పుడూ పర్స్‌లో ఒకే చోట ఉంచకూడదు. నాణేలను పర్సులో ఉన్న ప్రత్యేక జిప్‌ అరలో ఉంచండి. మరోవైపు మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు లాంటివి పర్సులో ఉంచకూడదు. అవి పెట్టడం వల్ల లక్ష్మీదేవి దరికి రాదు. అవి ఉంటే మీరు అత్యంత హీనమైన పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Also Read

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!

ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఏలుతోంది.. ఈమెవరో గుర్తుపట్టారా!