Viral Video: పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Jul 20, 2021 | 1:23 PM

Viral Video: పాము, ముంగీసలు బద్దశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే.. బాహుబలి, భల్లాలదేవ రేంజ్‌లో పెద్ద యుద్ధం...

Viral Video: పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!
Snake Mongoose

పాము, ముంగీసలు బద్దశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే.. బాహుబలి, భల్లాలదేవ రేంజ్‌లో పెద్ద యుద్ధం జరిగినట్లే. రెండూ కూడా భీకరంగా పోరాడుతాయి. ముంగీస అయితే పామును చంపేవరకు ఊరుకోదు. ఇక ఈ రెండింటి మధ్య జరిగే పోరాటం చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా మహారాష్ట్రలోని బుల్దాన్ జిల్లాలో పాము, ముంగీసల మధ్య జరిగిన పోరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. రోడ్డుపై పాము జరజరా పాక్కుంటూ వెళ్తుండగా.. ఓ వైపు నుంచి ముంగీస దాన్ని చూస్తుంది. ఇంకేముంది ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయినట్లే. దాదాపు ఏడు నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో ముంగీసే విజయం సాధించింది. దాని నుంచి తప్పించుకునేందుకు పాము శతవిధాల ప్రయత్నించింది. అయినా ప్రయోజనం లేకపోయింది. యుద్దంలో విజయం సాధించిన ముంగీస చివరికి పామును నోట కరుచుకుని పొదల్లోకి పారిపోయింది.

దీనికి సంబంధించిన వీడియోను “Jaat Entertainment” తమ ఫేస్‌బుక్‌ పోస్ట్ చేసింది. ఇక నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. దీనికి ఇప్పటిదాకా 8.20 లక్షల వ్యూస్ సంపాదించింది. అలాగే 17 వేల లైకులు కూడా వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!

ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఏలుతోంది.. ఈమెవరో గుర్తుపట్టారా!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu