IND vs SA: షాకింగ్‌.. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్న ఇషాన్‌ కిషన్‌.. తెలుగబ్బాయికి అవకాశం

టెస్ట్ సిరీస్‌ నుంచి ఇషాన్ కిషన్ ఎందుకు తప్పుకున్నాడో స్పష్టంగా తెలియలేదు. ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాల వల్ల జట్టు నుంచి తప్పుకున్నాడని, ఆ తర్వాత అతని అభ్యర్థనను బోర్డు అంగీకరించిందని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఇషాన్ కిషన్ తప్పుకోవడంతో టెస్ట్‌ జట్టులో ఉన్న కెఎల్ రాహుల్ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు.

IND vs SA: షాకింగ్‌.. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్న ఇషాన్‌ కిషన్‌.. తెలుగబ్బాయికి అవకాశం
Ishan Kishan, Ks Bharat
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2023 | 8:43 PM

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌ మధ్యలో ఒక షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇషాన్ కిషన్ దూరమయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇషాన్ కిషన్ స్వయంగా తన పేరును సిరీస్ నుంచి ఉపసంహరించుకున్నాడని,ఇందుకు తాము అనుమతి ఇచ్చినట్లు బోర్డు తెలిపింది. అతని స్థానంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే టెస్ట్ సిరీస్‌ నుంచి ఇషాన్ కిషన్ ఎందుకు తప్పుకున్నాడో స్పష్టంగా తెలియలేదు. ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాల వల్ల జట్టు నుంచి తప్పుకున్నాడని, ఆ తర్వాత అతని అభ్యర్థనను బోర్డు అంగీకరించిందని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఇషాన్ కిషన్ తప్పుకోవడంతో టెస్ట్‌ జట్టులో ఉన్న కెఎల్ రాహుల్ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు.

ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్ పర్యటనలో లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ఇషాన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో ఇషాన్‌ రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఇషాన్ 3 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ సహా 78 పరుగులు చేయగా, 5 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. అయితే ఇషాన్‌కు దక్షిణాఫ్రికా సిరీస్‌ తుది జట్టులో స్థానం కష్టమే. ఎందుకంటే ప్రపంచ కప్‌లో రాహుల్ కీపర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా అద్భుతంగా రాణించాడు. వికెట్‌ కీపర్‌ గానూ ఆకట్టుకున్నాడు. కాబట్టి దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ చేయనున్నాడు. అలాగే కీపింగ్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక ఇషాన్ స్థానంలో అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ని బీసీసీఐ తిరిగి జట్టులోకి పిలిచింది. అంతకుముందు, భారత్ వెస్టిండీస్ పర్యటనలో కూడా జట్టులో ఉన్నాడు. అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు జట్టులోకి వచ్చినా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ ట్వీట్..

మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం..

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..