IND vs SA: అర్ష్‌దీప్‌ పాంచ్‌ పటాకా.. రాణించిన సాయి సుదర్శన్‌.. మొదటి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు

మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 27.3 ఓవర్లలోనే 116 పరుగులకే కుప్ప కూలింది. టీమిండియా లెఫ్టార్మ్‌ సీమర్‌ అర్ష్‌ దీప్‌ సింగ్‌ ఐదు వికెట్లతో సఫారీల నడ్డీ విరిచాడు. మరో ఫాస్ట్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ కేవలం 17 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది

IND vs SA: అర్ష్‌దీప్‌ పాంచ్‌ పటాకా.. రాణించిన సాయి సుదర్శన్‌.. మొదటి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు
India Vs South Africa
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2023 | 6:55 PM

దక్షిణఫ్రికాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం (డిసెంబర్‌ 17) జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 27.3 ఓవర్లలోనే 116 పరుగులకే కుప్ప కూలింది. టీమిండియా లెఫ్టార్మ్‌ సీమర్‌ అర్ష్‌ దీప్‌ సింగ్‌ ఐదు వికెట్లతో సఫారీల నడ్డీ విరిచాడు. మరో ఫాస్ట్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ కేవలం 17 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్‌ 55 పరుగులు, శ్రేయస్‌ అయ్యర్‌ 52 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతేడాతో విజయం సాధించిన రాహుల్‌ సేన మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన అర్ష్‌ దీప్‌ సింగ్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లకు టీమిండియా పేసర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా అర్ష్‌దీప్, అవేశ్‌ ఖాన్‌ వరుసగా వికెట్లు పడగొట్టి అతిథ్య జట్టును బాగా దెబ్బ తీశారు.ఆ జట్టులో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ ఫెలుక్వాయో (33) టాప్‌ స్కోరర్ కావడం గమనార్హం. అతడితోపాటు ఓపెనర్ టోనీ డిజోర్జి (28), సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్‌ మార్‌క్రమ్‌ (12), షంసి (11*) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.  హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), కేశవ్‌ మహరాజ్‌ (4) పరుగులు చేయగా, రీజా హెండ్రిక్స్, వాండర్‌ డసెన్, వియాన్‌ ముల్డర్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఒక దశలో 52 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 80లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే ఫెలుక్వాయో దూకుడుగా ఆడి ఆడటంతో దక్షిణాఫ్రికా స్కోరు వంద పరుగులు దాటింది. ఇక భారత్ తరఫున అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ 43 బంతుల ఇన్నింగ్స్‌లో తొమ్మిది బౌండరీలతో అజేయంగా 55 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్‌కు మంచి సహకారం అందించిన శ్రేయాస్ అయ్యర్ 45 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ కూడా ఉన్నాయి. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐదు పరుగులకే ఔట్ కాగా, తిలక్ వర్మ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో ఒక్కో వికెట్ తీశారు.

ఐదు వికెట్లతో రాణించిన అర్ష్ దీప్ సింగ్..

రెండు జట్ల  ప్లేయింగ్ 11..

భారతదేశం: కేఎల్ రాహుల్(కీపర్/కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, టోనీ డి జోరాజీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెలుక్వాయ్, వియాన్ ముల్డర్, నాండ్రే బెర్గర్, కేశవ్ మహారాజ్/తబరేజ్ షమ్సీ, లిజాద్ విలియమ్స్.