The Rajasaab: డిఫరెంట్ లుక్‌లో ప్రభాస్.. డైలామాలో పడిన ఫ్యాన్స్
సంక్రాంతి రోజు అభిమానులకు షాక్ ఇచ్చారు డార్లింగ్ ప్రభాస్. ఈ సమ్మర్‌కి డార్లింగ్ మూవీ థియేటర్లలో సందడి చేయటం పక్కా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ను డైలామాలో పడేశారు. పొంగల్ కానుకగా ది రాజాసాబ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ అందులో రిలీజ్ డేట్‌ను మెన్షన్ చేయలేదు. కల్కి 2898 ఏడీ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్.