IND vs SA: గౌహతిలో తుఫాను ఇన్సింగ్స్‌.. సరికొత్త చరిత్ర సృష్టించిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. ఆ లిస్టులో అగ్రస్థానం..

Surya Kumar Yadav: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో సూర్య కుమార్ యాదవ్ భారీ రికార్డు సృష్టించాడు. నిజానికి టీ20 ఇంటర్నేషనల్‌లో అతి తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

IND vs SA: గౌహతిలో తుఫాను ఇన్సింగ్స్‌.. సరికొత్త చరిత్ర సృష్టించిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. ఆ లిస్టులో అగ్రస్థానం..
Virat Kohli, Surya Kumar Yadav
Follow us

|

Updated on: Oct 02, 2022 | 10:47 PM

భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ గౌహతిలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారత్‌కు శుభారంభం అందించి తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అదే సమయంలో వీరిద్దరూ ఔటైన తర్వాత భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్‌తో తుఫాను ఇన్నింగ్స్ ఆడి 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సూర్య తన T20 ఇంటర్నేషనల్‌లో వేయి పరుగులు కూడా పూర్తి చేశాడు. ఈ ఘనతతో తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అతి తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు చేసి తన టీ20 క్రికెట్ కెరీర్‌లో అతిపెద్ద రికార్డు సృష్టించాడు. T20 క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో వేయి పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు చేసేందుకు సూర్యకుమార్ యాదవ్ 573 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేట్ 174గా నిలిచింది.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్..

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్ యాదవ్ 573 బంతులు, స్ట్రైక్ రేట్ 174

గ్లెన్ మాక్స్‌వెల్ 604 బంతుల్లో స్ట్రైక్ రేట్ 166

కోలిన్ మున్రో 635 బంతులు, స్ట్రైక్ రేట్ 157

ఎవిన్ లూయిస్ 640 బంతులు, స్ట్రైక్ రేట్ 156

తిసార పెరీరా 654 బంతులు, స్ట్రైక్ రేట్ 153

T20లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండవ భారతీయ ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ T20 మ్యాచ్‌లో T20 క్రికెట్‌లో భారతదేశం తరపున అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు సాధించాడు. అలాగే ఈరోజు దక్షిణాఫ్రికాపై 18 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతనికి ముందు భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

మ్యాచ్ విషయానికి వస్తే..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టీ20 క్రికెట్‌లో భారత్‌కు ఇది నాలుగో అత్యధిక స్కోరుగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ టాప్ 4 బ్యాట్స్ మెన్ మంచి స్కోరు చేశారు. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అదే సమయంలో రోహిత్ శర్మ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. 28 బంతుల్లో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో 49 పరుగులు వచ్చాయి. వీరే కాకుండా సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 277.27గా నిలిచింది. అతని బ్యాట్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

రెండు జట్లు ప్లేయింగ్ XI..

భారతదేశం- రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, R. అశ్విన్, అర్ష్దీప్ సింగ్.

దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రిలే రస్సో, ఐడాన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, ఎన్రిక్ నోర్త్యా, కేశవ్ మహరాజ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..