Virat Kohli: కోహ్లీతో ఒక్క సెల్ఫీ కోసం రూ. 23 వేలు ఖర్చు చేసిన అభిమాని.. స్టోరీ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..

మన దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజ్ ఇంతా అంతా కాదు. భారత క్రికెటర్లను ఫ్యాన్స్ దేవుడితో పోలుస్తారు. దేశంలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ..

Virat Kohli: కోహ్లీతో ఒక్క సెల్ఫీ కోసం రూ. 23 వేలు ఖర్చు చేసిన అభిమాని.. స్టోరీ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..
Virat Kohli Fan
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 02, 2022 | 10:49 PM

మన దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజ్ ఇంతా అంతా కాదు. భారత క్రికెటర్లను ఫ్యాన్స్ దేవుడితో పోలుస్తారు. దేశంలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ.. క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ దేనికీ ఉండదు. క్రికెట్ ప్రేమికులు తమ అభిమాన క్రికెటర్ కోసం అభిమానులు ఏం చేయడానికి సిద్ధంగా ఉంటారు. క్రికెటర్లపై అభిమానుల ప్రేమకు అవధులు ఉండవు. వీటన్నింటికీ మించి ప్రపంచ క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీని ప్రేమించే అభిమానుల సంఖ్య భారీగానే ఉంది. అందుకు తాజా ఉదాహరణ.. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఏకైక భారత క్రికెటర్ విరాట్ మాత్రమే. అలాంటి విరాట్ కోహ్లీతో ఒక్క సెల్ఫీ కోసమో, ఆటోగ్రాఫ్ కోసమో అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధమే. కోహ్లితో ఒక్క ఫోటో కోసం చాలా మంది అభిమానులు మైదానం మధ్యలోకి ప్రవేశించడం మనం చాలాసార్లు చూశాం. ఈ క్రమంలో ఓ అభిమాని.. కోహ్లితో ఫోటో దిగేందుకు రూ.23 వేలు చెల్లించుకున్నాడు. దీన్నిబట్టి చెప్పొచ్చు కోహ్లీ క్రేజ్ ఏంటో.

టీమిండియా బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు అస్సాంకు చెందిన ఓ అభిమాని రూ.23వేలు చెల్లించాడు. ఖర్చుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఖరీదైన సెల్ఫీ తీసుకున్న అభిమాని గౌహతిలోని శాంతిపూర్ నివాసి రాహుల్ రాయ్ గా తెలుస్తోంది.

2వ టీ20 మ్యాచ్ కోసం గౌహతి చేరుకుంది టీమిండియా. ఈ నేపథ్యంలోనే కోహ్లీని కలిసేందుకు రాహుల్ విమానాశ్రయానికి వెళ్లాడు. కానీ అక్కడున్న సెక్యూరిటీ గార్డు రాహుల్‌ని విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లనివ్వలేదు. దీంతో నిరుత్సాహానికి గురైన రాహుల్ గౌహతిలో టీమిండియా బస చేసిన హోటల్‌లో గది కూడా బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ గదిని బుక్ చేసుకోవడం అంత సులభం కాదు. టీమ్ ఇండియా ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేస్తున్నందున, ఆ హోటల్ లో ఒక రోజు బసకు రూ.23,400 ఖర్చవుతుంది. అయితే డబ్బు గురించి ఆలోచించకుండా కోహ్లీతో సెల్ఫీ దిగాలని నిర్ణయించుకున్న రాహుల్.. అదే హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. తన ప్రయత్నాలను విరమించుకోని రాహుల్.. రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ లాంజ్‌లో విరాట్ తో సెల్ఫీ దిగాడు. బ్రేక్‌ఫాస్ట్ లాంజ్‌లో విరాట్‌ను కలిసిన రాహుల్.. కోహ్లీతో సెల్ఫీ దిగడంతో పాటు కోహ్లీ ఫోటోపై తన ఆటోగ్రాఫ్ కూడా తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!