India vs Netherlands: నెదర్లాండ్స్‌తో టీమిండియా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే?
గురువారం ఉదయం సిడ్నీలో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యా్చ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌కే వరణుడి ముప్పు ఎక్కువగా ఉంది. ఇక స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30) ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం (అక్టోబర్ 27) ఇండియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న భారతజట్టు ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అయితే టీ20 ప్రపంచకప్‌కు వరుణుడు మెయిన్ విలన్‌గా మారాడు. వర్షం కారణంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈనేపథ్యంలో సిడ్నీమ్యాచ్‌కూ వర్షం ముప్పు ఉందా? అనే అనుమానాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో సిడ్నీలో గురువారం వర్షం కురిసే అవకాశాలు 80 శాతానికిపైగా ఉన్నాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా గురువారం ఉదయం సిడ్నీలో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యా్చ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌కే వరణుడి ముప్పు ఎక్కువగా ఉంది. ఇక స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30) ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ సమయంలో 40 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వ వాతావరణ శాఖ తెలిపింది. ఒక వేళ వర్షం కురిసినా.. మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి ఉండదంటున్నారు. ‘ఉదయం వర్షం పడే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లోనే 40 శాతం మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉంది’ అని అక్కడి వాతావరణ శాఖ వెబ్‌సైట్ వెల్లడించింది.
కాగా అటు ప్రముఖ వాతావరణ అంచనా వెబ్‌సైట్ అక్యూవెదర్ అయితే గురువారం అసలు వర్షం పడే అవకాశమే లేదని చెప్పింది. మరి ఎందులో ఎంత నిజముందో తెలియాలంటే మ్యాచ్ జరిగే వరకు ఆగాల్సిందే. ఇక ఇప్పటికే ఈ వరల్డ్‌కప్ సూపర్ 12 స్టేజ్‌లో వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. వర్షం వల్ల జింబాబ్వేతో గెలిచే మ్యాచ్‌లో సౌతాఫ్రికా పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ఇక న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ పూర్తిగా రద్దయింది. ఇదే వర్షం వల్ల డక్‌వర్త్ లూయిస్ నిబంధనలతో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. కాబట్టి ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.




మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..




