AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. రెండో టెస్టుకు కీలక ప్లేయర్ దూరం! గిల్ సేనకు మరిన్ని కష్టాలు

లీడ్స్‌లో ఓటమి తర్వాత, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే రెండో టెస్ట్‌కు భారత్ సిద్ధమవుతోంది. ఈ టెస్టులో ఎలాగైనా గెలవాలని గిల్ సేన కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం నెట్ ప్రాక్టీస్ లో బాగానే చెమటోడ్చుతున్నారు. అయితే ఈ దశలో రెండో టెస్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.

IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. రెండో టెస్టుకు కీలక ప్లేయర్ దూరం! గిల్ సేనకు మరిన్ని కష్టాలు
Team India
Basha Shek
|

Updated on: Jun 26, 2025 | 9:56 PM

Share

లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఐదు సెంచరీలు సాధించినప్పటికీ టీం ఇండియా ఓడిపోయింది. ఇందుకు చాలా కారణాలున్నాయి. అయితే ఇప్పుడు వాటన్నటినీ మర్చిపోయి ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. ఈ మ్యాచ్ జూలై 2 నుండి ప్రారంభమవుతుంది. కానీ ఈ మ్యాచ్‌కు ముందు, గిల్ సేనకు భారీ ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, లీడ్స్ టెస్ట్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమే. బుమ్రా తప్ప మరే ఇతర బౌలర్ సమర్థవంతంగా రాణించలేకపోయాడు. ఇప్పుడు స్పీడ్ స్టర్ గనక 2వ టెస్ట్‌కు దూరమైతే భారత జట్టుకు మరిన్ని సమస్యలు తప్పవు. నిజానికి, టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే, జస్ప్రీత్ బుమ్రా 5 మ్యాచ్‌లలోనూ ఆడటం లేదని వార్తలు వచ్చాయి. అతను కేవలం 3 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడతాడని సెలెక్టర్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే విషయంపై టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ, ‘బుమ్రా ఏ మూడు మ్యాచ్‌లు ఆడతాడనేది పెద్ద ప్రశ్న. బుమ్రా 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని నివేదిక నిజమైతే, అతను రెండవ టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉంటాడు. ఎందుకంటే బుమ్రా లార్డ్స్‌లో జరుగుతున్న మూడవ మ్యాచ్‌లో ఆడాలనుకుంటున్నాడు. లార్డ్స్ మైదానం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి బుమ్రా ఇక్కడ బాగా బౌలింగ్ చేయగలడు’

‘లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ కు ముందు బుమ్రాకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. ఒక వేళ అతను ఎడ్జ్ బాస్టన్ లో ఆడితే, అతను లార్డ్స్ లో ఆడలేడు. ఎందుకంటే రెండు మ్యాచ్ ల మధ్య నాలుగు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. అయితే, బుమ్రాను ఏ టెస్టుల్లో ఆడించాలో, ఏ టెస్టులు ఆడకూడదో జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రాను ఆడించకపోతే, ఆ టెస్ట్ మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోయే ప్రమాదం ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా చాలా ఓవర్లు వేశాడు. ఇప్పుడు అతనికి విశ్రాంతి అవసరం. అలాగే, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమ్ ఇండియా రికార్డు చాలా పేలవంగా ఉంది. అందువల్ల, రెండో టెస్ట్‌లో జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూసేందుకు ఆసక్తి గా ఎదురుచూస్తున్నాను’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయం కోసం టీమ్ ఇండియా చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే భారత జట్టు ఇక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మైదానంలో భారత జట్టు చాలాసార్లు గెలుపుకు దగ్గరగా వచ్చి ఓడిపోయింది లేదా డ్రా చేసుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్ ఇండియా ఏడు మ్యాచ్‌లు ఆడింది. వీటిలో మూడుసార్లు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌