IND vs ENG 2nd ODI: కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌తో రెండో వన్డే పోరు.. సోఫియా గార్డెన్స్‌లో భారత్ రికార్డు ఎలా ఉంది?
IND vs ENG 2nd ODI: కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో రెండో వన్డేకు సిద్ధమైన టీమిండియా.. ఈ మైదానంలో 75 శాతం విజయాల రికార్డును కలిగి ఉంది. మరో 9 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించనున్నాడు. సిరీస్ కైవసం చేసుకోవాలని గిల్ సేన పట్టుదలగా ఉంది.

IND vs ENG 2nd ODI: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రెండో పోరుకు కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ మైదానం సిద్ధమైంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఈ సిరీస్‌ను ఎంతో అద్భుతంగా ప్రారంభించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను క్లినికల్‌గా ఓడించి ఘన విజయం సాధించింది. దీనికి ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసినందున, వన్డే సిరీస్‌లో ఈ విన్నింగ్ మొమెంటంను ఇలాగే కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. మూడో వన్డే వరకు వెళ్లకుండా, ఈ రెండో మ్యాచ్‌లోనే విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని గిల్ సేన వ్యూహాలు రచిస్తోంది.
సోఫియా గార్డెన్స్‌లో భారత్ రికార్డు ఎలా ఉంది?
కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టుకు చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. టీమిండియా ఈ వేదికపై 2011 నుంచి 2018 మధ్య మొత్తం ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించగా, రెండింటిలో మాత్రమే ఓటమిని చవిచూసింది. అంటే ఈ ఇంగ్లీష్ పిచ్‌పై భారత్ 60 శాతం విన్నింగ్ రేట్‌ను కలిగి ఉంది. గతంలో ఇక్కడ జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లను భారత్ చిత్తుగా ఓడించింది. ఇక వన్డే ఫార్మాట్ విషయానికి వస్తే, టీమిండియా ఇక్కడ ఆడిన నాలుగు వన్డేల్లో మూడింటిని గెలుచుకుని, ఏకంగా 75 శాతం సక్సెస్ రేట్‌తో తిరుగులేని ఫామ్‌లో ఉంది.
కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ పాత రికార్డులు
సోఫియా గార్డెన్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు వన్డేల్లో తలపడిన చరిత్రను పరిశీలిస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. ఇక్కడ ఈ రెండు జట్లు రెండు వన్డేల్లో ముఖాముఖి తలపడగా, చెరో మ్యాచ్‌లో విజయం సాధించి 50 శాతం సక్సెస్ రేట్‌తో ఉన్నాయి. 2011 లో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌కు ఇంగ్లాండ్ చేతిలో 6 వికెట్ల భారీ ఓటమి ఎదురైంది. కానీ ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పక్కా ప్లాన్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యి 133 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పిచ్‌పై ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్ సరిగ్గా 304 పరుగుల ఒకే రకమైన భారీ స్కోరును బోర్డుపై ఉంచడం విశేషం.
సురేష్ రైనా సెంచరీ విద్వంసం
ఈ రెండు జట్లు కార్డిఫ్ మైదానంలో వన్డేలో తలపడిన చివరి మ్యాచ్ భారత అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటర్ సురేష్ రైనా కేవలం 75 బంతుల్లోనే 100 పరుగులు చేసి సెంచరీతో విద్వంసం సృష్టించాడు. దీంతో భారత్ 304 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మ్యాజిక్‌తో చుక్కలు చూపించాడు. జడ్డూ నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు 38.1 ఓవర్లలో కేవలం 161 పరుగులకే కుప్పకూలిపోయింది.
ఇంగ్లాండ్ గడ్డపై కోహ్లీ విశ్వరూపం
కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ మైదానంలో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన బ్యాటర్ల జాబితాలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల్లో 60.75 సగటుతో, 101.67 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 243 పరుగులు చేశాడు. ఇందులో కేవలం వన్డేల్లోనే 196 పరుగులు ఉన్నాయి. 2011లో ఈ మైదానంలో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ 93 బంతుల్లో 107 పరుగులతో అద్భుతమైన సెంచరీ బాదాడు. విరాట్ కోహ్లీ తర్వాత శిఖర్ ధావన్ 203 పరుగులతో రెండో స్థానంలో, ఎంఎస్ ధోని 161 పరుగులతో మూడో స్థానంలో, సురేష్ రైనా 158 పరుగులతో నాల్గో స్థానంలో, కెప్టెన్ రోహిత్ శర్మ 155 పరుగులతో ఐదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా ఉన్నారు.
సురేష్ రైనా రికార్డుకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ
ఈ మైదానంలో ఇంగ్లాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా సురేష్ రైనా (115 పరుగులు) రికార్డుల్లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌పై ఇక్కడ 107 పరుగులు చేశాడు. ఈ రెండో వన్డేలో కోహ్లీ కేవలం మరో 9 పరుగులు చేస్తే, రైనాను వెనక్కి నెట్టి కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా 8 వికెట్లతో కార్డిఫ్‌లో అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌గా నిలిచాడు. జడ్డూ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు, ఇషాంత్ శర్మ 5 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉండగా, ఉమేష్ యాదవ్ 4 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ పాత రికార్డుల జోరుతో భారత్ రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
