IND vs BAN: పవర్ ప్లేలో దంచి కొట్టిన భారత్.. టీ20 ప్రపంచకప్ 2024లో రోహిత్ సేన రికార్డ్..
పవర్ ప్లే దశ ముగిసే వరకు విరాట్ 18 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, వార్తలు రాసే సమయానికి భారత్ 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. రోహిత్ 23, కోహ్లీ 37, పంత్ 36, సూర్య 6 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. టీ20 ప్రపంచకప్‌లో 2021లో స్కాట్‌లాండ్‌పై స్కోరు చేసిన 82 పరుగులే భారత్ అత్యుత్తమంగా నిలిచింది.
India vs Bangladesh, 47th Match, Super 8 Group 1: శనివారం ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత్ తన అత్యధిక పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సమయంలో.. ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారోనని అంతా ఆశగా చూస్తున్నారు. ఈ క్రమంలో పవర్ ప్లేను దూకుడిగా ఆరంభంచిన రోహిత్, కోహ్లీ.. గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై తన మునుపటి అత్యుత్తమ 50 పరుగులను మెరుగుపరుచుకుని, మొదటి ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 53 వద్ద ముగించింది.
రోహిత్, విరాట్‌లు తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించి, టోర్నీలో తమ అత్యుత్తమ ఓపెనింగ్‌ను నమోదు చేశారు. అయితే, రోహిత్ 23 పరుగుల వద్ద షకీబ్ అల్ హసన్ సంధించిన బంతిని ఆఫ్ కవర్స్ ఆడి పెవిలియన్ చేరాడు.
పవర్ ప్లే దశ ముగిసే వరకు విరాట్ 18 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, వార్తలు రాసే సమయానికి భారత్ 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. రోహిత్ 23, కోహ్లీ 37, పంత్ 36, సూర్య 6 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. టీ20 ప్రపంచకప్‌లో 2021లో స్కాట్‌లాండ్‌పై స్కోరు చేసిన 82 పరుగులే భారత్ అత్యుత్తమంగా నిలిచింది.
ఇరు జట్లు:
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..