Hardik Pandya: హార్దిక్ యాటిట్యూడ్ షాట్ చూశారా? నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. గ్వాలియర్‌లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం (అక్టోబర్ 07) ఇరు జట్ల మధ్య సిరీస్ తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. గ్వాలియర్‌లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం (అక్టోబర్ 07) ఇరు జట్ల మధ్య సిరీస్ తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. బాల్‌తో పాటు బ్యాట్‌తోనూ విజృంభించాడు. మ్యాచ్‌లో అతను ఆడిన ఒక షాట్అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌లో అద్భుతమైన షాట్ ఆడాడు హార్దిక్. బంగ్లాదేశ్ అనుభవజ్ఞుడైన బౌలర్ తస్కిన్ అహ్మద్ బంతిని బౌన్సర్ గా వేశాడు. దాన్ని హార్దిక్ తన యాటిట్యూడ్ చూపిస్తూ కదల కుండా నో లుక్ సిక్స్ టైప్ లో జస్ట్ అలా బ్యాట్ ను బాల్ కు అడ్డంగా పెట్టాడు అంతే. ఆ తర్వాత కూడా బంతి ఎటువైపు వెళ్లిందనేది కూడా చూడ లేదు. కానీ బంతి మెరుపు వేగంతో బౌండరీకి వెళ్లిపోయింది. ఈ షాట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
కాగా ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియాకు సులువైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 16 బంతులు ఎదుర్కొని 243.75 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 39 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా కూడా 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. పాండ్యా సిక్సర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. హార్దిక్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడం ఇది ఐదవసారి. పాండ్యా తప్ప మరే భారత బ్యాటర్ కూడా ఇన్ని సార్లు సిక్సర్లతో జట్టును గెలిపించలేకపోయారు.
వీడియో ఇదిగో..
Best Shot of #IndvsBan 1st T20i 🔥 No look Shot by #HardikPandya Swag wala Pandya 😍🗿 pic.twitter.com/kEXah2RwTB
— Hardik Kohli (@ShortStatus1) October 6, 2024
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆయన నిర్ణయం సరైనదని కూడా రుజువైంది. బంగ్లాదేశ్ జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి చెరో 3 వికెట్లు తీశారు. అలాగే హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 11.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. పాండ్యాతో పాటు సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ కూడా 29-29 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చడంలో సహకరించారు.
జైషా అభినందనలు..
Brilliant win for our boys, right after a special performance from our women’s team! 🤩 @arshdeepsinghh continues to be a game changer in the shorter formats, and great to see @chakaravarthy29 shine in his comeback match. All eyes on the second T20I in Delhi as we look to seal… pic.twitter.com/4NBYl7qpRB
— Jay Shah (@JayShah) October 6, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..