IND vs AUS: అదరగొడుతోన్న భారత అమ్మాయిలు.. ఆసీస్‌తో టెస్టులో గెలుపు దిశగా టీమిండియా
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం దిశగా పయనిస్తోంది. . ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 157 పరుగుల ఆధిక్యం సాధించింది.
అమ్మాయిలు అదరగొడుతున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది భారత మహిళా క్రికెట్ జట్టు. పటిష్ఠమైన ఇంగ్లండ్‌పై ఏకంగా 347 పరుగుల తేడాతో గెలుపొంది టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియాను కూడా చిత్తు చేసే పనిలో ఉన్నారు భారత మహిళా క్రికెటర్లు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం దిశగా పయనిస్తోంది. . ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆస్ట్రేలియా బౌలర్లకు ధీటుగా సమాధానం ఇవ్వడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 376 పరుగులు చేసింది. దీంతో భారత్ ఇప్పటి వరకు 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తరఫున నలుగురు బ్యాటర్లు యాభై పరుగులు చేయడం విశేషం. రెండో రోజు ముగిసే సమయానికి దీప్తి శర్మ అజేయంగా 70 పరుగులు, పూజా వస్త్రాకర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకు ముందు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 74 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ కూడా 52 పరుగులతో సత్తా చాటింది. వీరితో పాటు మిడిలార్డర్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (0), యషిక్త భాటియా (1), స్నేహా రాణా (9) నిరాశ పర్చారు. ఆస్ట్రేలియా తరఫున యాష్లే గార్డనర్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు పైగా స్కోర్ చేస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం నల్లేరుపై నడకే. మూడో రోజు దీప్తి, పూజ ఎంత వరకు తమ స్కోరును తీసుకెళ్లుతుందన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు మొత్తం 219 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తరఫున తహ్లియా మెక్‌గ్రాత్ అత్యధికంగా 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, బెత్ మూనీ 40 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ అలిస్సా హీలీ 38, కిమ్ గార్త్ 28 పరుగులు చేశారు. పూజా వస్త్రాకర్ అత్యధికంగా 4 వికెట్లు తీయగా, స్నేహ రాణా 3 వికెట్లు, దీప్తి శర్మ 2 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరదించారు.
Valuable with the bat once again 👏👏@Deepti_Sharma06 brings up her fifty with a four 👌👌#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank https://t.co/jcsf7y9eKW pic.twitter.com/W2zCgPRugJ
— BCCI Women (@BCCIWomen) December 22, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..