AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ప్రపంచకప్‌కు ముందు పరేషాన్‌.. మూడో వన్డేలో తేలిపోయిన టీమిండియా బౌలర్లు.. సెంచరీ దాటేసిన స్పిన్నర్లు

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్‌ చేసింది. దీనికి తోడు భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. చివరకు ప్రపంచకప్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పిన్నర్లు కూడా పూర్తిగా చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ ముగ్గురు కలిపి ఏకంగా

IND vs AUS: ప్రపంచకప్‌కు ముందు పరేషాన్‌.. మూడో వన్డేలో తేలిపోయిన టీమిండియా బౌలర్లు.. సెంచరీ దాటేసిన స్పిన్నర్లు
India Vs Australia
Basha Shek
|

Updated on: Sep 27, 2023 | 7:36 PM

Share

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్‌ చేసింది. దీనికి తోడు భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. చివరకు ప్రపంచకప్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పిన్నర్లు కూడా పూర్తిగా చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ ముగ్గురు కలిపి ఏకంగా 157 పరుగులు సమర్పించుకున్నారు. అదికూడా 26 ఓవర్లలోనే. కుల్‌ దీప్‌ 2 వికెట్లు తీయగా, జడేజా, సుందర్‌లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇక స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు కూడా పడగొట్టినప్పటికీ 10 ఓవర్లలో 81 పరుగులు ఇవ్వడం గమనార్హం. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఇదే ఆఖరి మ్యాచ్‌. అయితే స్పిన్నర్లతో సహా టీమిండియా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 352 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రవిచంద్రన్ అశ్విన్‌ ఆడలేదు. అతనికి వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి వచ్చాడు. అతనితో పాటు జడేజా, కుల్దీప్ యాదవ్ బంతిని పంచుకున్నారు. అయితే ఎవ్వరూ ప్రభావం చూపలేకపోయారు. జడేజా 61 పరుగులు, వాషింగ్టన్ 48 పరుగులు ఇవ్వగా, ఇద్దరికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు, కుల్దీప్ యాదవ్ కూడా 48 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక ఆసియా కప్ స్టార్‌ మహ్మద్ సిరాజ్ 9 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ 5 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేయగా, 27వ ఓవర్లో స్కోరు 200 దాటింది. అయితే చివరి 20 ఓవర్లలో టీమ్ ఇండియా బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో 370 దాటుతుందనన స్కోరు 350 వద్ద మాత్రమే ఆగిపోయింది. చివరి 10 ఓవర్లలో టీమిండియా బౌలర్లు కేవలం 70 పరుగులు మాత్రమే ఇచ్చారు. రాజ్‌కోట్‌ మైదానంలో జరిగిన వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు ఆస్ట్రేలియాపై భారత్ 340 పరుగుల స్కోరు చేసింది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మరో చరిత్ర సృష్టించనట్లే. ఇక 353 పరుగుల లక్ష్య ఛేదనలో కడపటి వార్తలందే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టానికి 133 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (74), విరాట్‌ కోహ్లీ (34) ధాటిగా ఆడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నిరాశపర్చిన బుమ్రా, సిరాజ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?