IND vs SL: లైవ్‌ మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లీ కాళ్లు పట్టుకున్న అభిమాని.. ప్రేక్షకుల మనసులు గెల్చుకున్న సూర్య

తిరువనంతపురం మ్యాచ్‌లో ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగానే ఒక అభిమాని విరాట్‌ దగ్గరకు వచ్చాడు. ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్ కాళ్లు మొక్కుతూ కేకలు వేశాడు.

IND vs SL: లైవ్‌ మ్యాచ్‌లో  కింగ్‌ కోహ్లీ కాళ్లు పట్టుకున్న అభిమాని.. ప్రేక్షకుల మనసులు గెల్చుకున్న సూర్య
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Jan 16, 2023 | 10:02 AM

తిరువనంతపురం వేదికగా.. శ్రీలంకతో జరిగిన జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో వీర విహారం చేశారు. ఫోర్లు, సిక్సర్లతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. కేవలం 110 బంతుల్లో 166 పరుగుల చేశాడు. అతని ఇన్నింగ్స్‌ లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లీకిది 74వ సెంచరీ కాగా వన్డేల్లో 46వది. ఇక ఈ సిరీస్‌లో రెండో సెంచరీ కాగా గత 4 వన్డేల్లో మూడో సెంచరీ కావడం మరో విశేషం. ఈ మ్యాచ్‌ ద్వారా స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.  ఈ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన విరాట్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ పురస్కారాలు లభించాయి. కాగా తిరువనంతపురం మ్యాచ్‌లో ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగానే ఒక అభిమాని విరాట్‌ దగ్గరకు వచ్చాడు. ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్ కాళ్లు మొక్కుతూ కేకలు వేశాడు. కోహ్లీ కూడా అతన్ని పైకి లేపి హత్తుకున్నాడు. అయితే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ అందరి మనసులు గెల్చుకున్నాడు.  స్మార్ట్ ఫోన్ తీసుకుని స్వయంగా కోహ్లీ, ఆ అభిమాని ఫొటోలు తీశాడు.   దీంతో  ఒక్కసారిగా ప్రేక్షకులు హర్షధ్వానాలు, కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు.

అయితే ఇప్పుడీ ఘటనే తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ అభిమాని భద్రతను ఉల్లంఘించి మరీ మైదానంలోకి రావడం, ఆటగాళ్ల దగ్గరకు రావడం స్టేడియంలోని భద్రతా వైఫల్యాన్ని సూచిస్తోంది. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో ఆమీతుమీ తేల్చుకోనుంది. వన్డేలు, టీ20 సిరీస్‌లు ఆడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ బుధవారం (జనవరి 18) జరగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. మ్యాచ్‌ కోసం కివీస్‌ జట్టు ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకోగా.. ఈ రోజు (జనవరి 17) టీమిండియా రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..