Sidharth Sharma: నాన్నా.. నాకు క్రికెట్‌ ఆడాలని ఉంది !! కన్నీళ్లు పెట్టిస్తోన్న యంగ్ క్రికెటర్‌ ఆఖరి మాటలు

హిమాచ‌ల్ ప్రదేశ్‌కు చెందిన ఫాస్ట్ బౌల‌ర్ సిద్ధార్థ్ శ‌ర్మ (28) ఇటీవల కన్నుమూశాడు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అతను చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సిద్ధార్థ్‌ మరణం సహచర క్రికెటర్లతో పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను కలిచివేసింది.

Sidharth Sharma: నాన్నా.. నాకు క్రికెట్‌ ఆడాలని ఉంది !! కన్నీళ్లు పెట్టిస్తోన్న యంగ్ క్రికెటర్‌ ఆఖరి మాటలు
Sidharth Sharma
Follow us
Basha Shek

|

Updated on: Jan 16, 2023 | 12:20 PM

హిమాచ‌ల్ ప్రదేశ్‌కు చెందిన ఫాస్ట్ బౌల‌ర్ సిద్ధార్థ్ శ‌ర్మ (28) ఇటీవల కన్నుమూశాడు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అతను చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సిద్ధార్థ్‌ మరణం సహచర క్రికెటర్లతో పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను కలిచివేసింది. రంజీట్రోఫీ కోసం గుజరాత్‌ జట్టుతో ఉన్న సిద్ధార్థ్‌ హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వ‌డోద‌ర‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాలుగా వైద్యులు అత‌నికి వెంటిలేట‌ర్ మీద చికిత్స అందించారు. అయితే దురదృష్టవశాత్తూ చికిత్సకు శరీరం స్పందించకపోవడంతో చిన్న వయసులోనే కన్నుమూశాడు. యంగ్ క్రికెటర్‌ పట్ల హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రితో పాటు క్రికెట్‌ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అయితే సిద్ధార్థ్‌ మృతికి కారణమేంటన్నది ఇప్పటివరకు తెలియలేదు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్‌ ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ కంట తడి పెట్టిస్తున్నాయి. అతని స్నేహితుడు ప్రశాంత్ మాట్లాడుతూ ‘ సిద్ధార్థ్‌ ఐసీయూలో ఉన్నప్పుడు కనీసం మాట్లాడలేకపోయాడు. అందుకే నర్సు నుంచి ఒక పేపర్‌ తెప్పించుకుని అందులో నాన్నా .. నాకు క్రికెట్‌ ఆడాలని ఉంది. దయచేసి నన్ను ఆపొద్దు’ అని రాశాడట. ఆ సందర్భంలో ప్రశాంత్‌ కూడా అక్కడే ఉన్నాడట.

కాగా సిద్ధార్థ్‌ తండ్రి ఆర్మీలో పనిచేశారట. మొదట్లో తనకుమారుడిని క్రికెట్ ఆడేందుకు ఆయన అనుమతించలేదట. అయితే సిద్ధార్థ్‌ మాత్రం క్రికెట్‌నే కెరీర్‌ను ఎంచుకున్నాడని ప్రశాంత్ తెలిపాడు. కాగా గుజ‌రాత్‌లోని ఉనాలో సిద్ధార్థ్ శ‌ర్మ జ‌న్మించాడు. ఫాస్ట్ బౌల‌ర్‌గా హిమాచల్ ప్రదేశ్‌ త‌ర‌ఫున దేశ‌వాళీ ట్రోఫీలో 2017-18 సీజ‌న్‌లో ఆరంగ్రేటం చేశాడు. ఆ సీజ‌న్‌లో 25 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. 2021-22 సీజన్‌లో రంజీ ట్రోఫీ ఛాంపియ‌న్‌గా నిలిచిన‌ హిమాచ‌ల్ ప్రదేశ్‌ జట్టులో కూడా సిద్ధార్థ్‌ ఉన్నాడు. ఇక ప్రస్తుత రంజీట్రోఫీలో కూడా 12 వికెట్లు తీశాడు. చివరగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 7 వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్‌ జరిగిన 20 రోజులకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు సిద్ధార్థ్‌. కాగా సిద్ధార్థ్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటున్నారు. సోదరులు కెనడా నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత అతని అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..