IND VS NZ: బ్లాక్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ టికెట్లు.. హైదరాబాదీ యువకుడి అరెస్ట్
భారత్-న్యూజిలాండ్ జరగాల్సిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ కు సంబంధించి నకిలీ టికెట్లు విక్రయిస్తున్న హైదరాబాద్ వ్యక్తిని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద లభించిన రెండు మొబైల్ ఫోన్లు, పలు టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని స్టేడియం సమీపంలో పట్టుకున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ హితేష్ లఖన్‌పాల్ తెలిపారు. స్టేడియం బయట అనుమానంగా తచ్చాడుతున్న
భారత్-న్యూజిలాండ్ జరగాల్సిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ కు సంబంధించి నకిలీ టికెట్లు విక్రయిస్తున్న హైదరాబాద్ వ్యక్తిని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద లభించిన రెండు మొబైల్ ఫోన్లు, పలు టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని స్టేడియం సమీపంలో పట్టుకున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ హితేష్ లఖన్‌పాల్ తెలిపారు. స్టేడియం బయట అనుమానంగా తచ్చాడుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సుమారు 8 టిక్కెట్లు, 8 వేల రూపాయలు, రెండు మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. యువకుల నుంచి రికవరీ చేసిన టిక్కెట్ల ధరలు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. నకిలీ టిక్కెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడగగా, ఆ యువకుడు పలువురి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వారి కోసం కూడా అన్వేషిస్తున్నారు. ఆదివారం ధర్మశాల వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుండగా, ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. దీనినే అవకాశంగా తీసుకున్న కొందరు వ్యక్తులు టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు తెర లేపుతున్నాడు. ఇలాంటి టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
టాప్ పై గురి..
కాగా స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో భారత జట్టు దూసుకెళుతోంది. ఇప్పటికే నాలుగు వరుస విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు తమ తదుపరి మ్యాచ్‌లో బలమైన కివీస్ దళాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. పూణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తలపడేందుకు ఇప్పటికే ధర్మశాలకు వెళ్లింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచ కప్ పాయింట్ల జాబితాలో నంబర్ 1 స్థానాన్ని పొందుతుంది. కాబట్టి ఈ విజయం ఇరు జట్లకు తప్పనిసరి. ధర్మశాల చేరుకున్న భారత జట్టు శనివారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది. మరోవైపు అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో విజయం సాధించిన న్యూజిలాండ్ ధర్మశాలలో ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించింది.
ధర్మశాలకు చేరుకున్న టీమిండియా
Team India arrives in Dharamshala to take on New Zealand.pic.twitter.com/KY0ms9qUAB
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2023
భారత ప్రాబబుల్ స్క్వాడ్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ / మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..