ICC World Cup 2023: ఇవాళ వరల్డ్ కప్‌లో ‘డబుల్’ బ్యాంగ్.. అందరి దృష్టి మాత్రం ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పైనే..
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో స్కాట్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని నెదర్లాండ్స్ , కుశాల్ మెండిస్ నేతృత్వంలోని శ్రీలంక జట్లు ఉదయం 10:30 గంటలకు తలపడనున్నాయి. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్, టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు తలపడనున్నాయి.

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో స్కాట్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని నెదర్లాండ్స్ , కుశాల్ మెండిస్ నేతృత్వంలోని శ్రీలంక జట్లు ఉదయం 10:30 గంటలకు తలపడనున్నాయి. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్, టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు తలపడనున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు ప్రదర్శన అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక్కడ డచ్ జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా చవి చూడని లంకపై నెదర్లాండ్స్ ఎలా రాణిస్తుందో చూడాలి. కాగా ఆసియాకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సింహళీయులు ప్రపంచకప్‌లో తడబడ్డారు. దీనికి తోడు దసున్ షనక, హసరంగా వంటి స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం ఆ జట్టును బాగా దెబ్బతీసింది. నెదర్లాండ్స్ రెండో విజయంపై కన్నేసిన వేళ.. లంకేయులు మాత్రం ప్రపంచకప్‌లో తమ ఖాతా తెరవాలని యోచిస్తున్నారు.
ఇంగ్లాండ్-ఆఫ్రికా నెదర్లాండ్స్‌తో జరిగిన ఘోర పరాజయం నుంచి తిరిగి పుంజుకోవాలని దక్షిణాఫ్రికా చూస్తోంది. అయితే పాయింట్ల పట్టికలో ఆ జట్టు మూడో స్థానంలో ఉంది. జట్టులో స్టార్ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్రికా అద్భుత ప్రదర్శన కనబరిచింది. అదే రిథమ్‌లో ఆడితే మరో విజయం దక్కినట్లే. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిపోయింది. సమిష్టి ప్రదర్శనను కనబరచేందుకు జట్టు కష్టపడుతోంది. బట్లర్ తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది . ఈరోజు రెండు మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌పైనే ఉంది.
నెదర్లాండ్స్ జట్టు:
విక్రంజిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడ్మనూర్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, వెస్కీబ్లీ బెయుల్‌ఫీ , షరీజ్ అహ్మద్.
శ్రీలంక జట్టు:
పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్న, కసున్ రజిత, లహిరు కుమార పతిరన్, మహేశ్ తీక్షణ్.
దక్షిణాఫ్రికా జట్టు:
క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, కగిసో రబడ, లిజార్డ్ విలియమ్స్, లిజార్డ్ విలియమ్స్ తబ్రిజ్ షమ్సీ.
ఇంగ్లండ్ జట్టు:
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్ .
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




