HCA: హెచ్‌సీఏ కొత్త బాస్‌గా జగన్‌మోహన్ రావు.. ఒక్క ఓటు తేడాతో విజయం..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్‌మోహన్ రావు ఎన్నికయ్యారు. అధికార బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే ప్రత్యర్థి అమర్నాథ్ రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అయితే రీకౌంటింగ్ లోనూ ఒక్క ఓటు తేడాతో జగన్ మోహన్ రావు గెలుపొందారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్‌మోహన్ రావు ఎన్నికయ్యారు. అధికార బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే ప్రత్యర్థి అమర్నాథ్ రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అయితే రీకౌంటింగ్ లోనూ ఒక్క ఓటు తేడాతో జగన్ మోహన్ రావు గెలుపొందారు. శుక్రవారం (అక్టోబర్ 20) జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ సజావుగా సాగింది. మొత్తం ఓట్ల సంఖ్య 173. పోలైనవి 169. కౌంటింగ్ కూడా సాఫీగా సాగింది. గెలుపు సంబరాలు కూడా జోరందుకున్నాయి. కౌన్సెలర్‌గా సునీల్ అగర్వాల్ గెలవడంతో ఆయన ప్యానెల్ సంబరాలు జరుపుకుంది. క్రికెటర్స్ VVS లక్ష్మణ్, వెంకటపతి రాజు, మిథాలిరాజ్,స్రవంతి సహా పలువురు తమ HCA ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐపీఎస్ సజ్జనార్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఓటు వేసిన వారిలో ఉన్నారు. మూడు గంటలకు పోలీంగ్ పూర్తయింది. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. కాగా ప్రెసెడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిలర్ …ఈ 6 పదవుల కోసం నాలుగు ప్యానెల్స్ ఎన్నికల బరిలో దిగాయి.
సుప్రీం కోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ లావు నాగేశ్వర రావు ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వీఎన్ సంపత్ ఆధ్వర్యలో HCA ఎన్నికలు నిర్వహించారు. ప్రెసిడెంట్ పదవికి జగన్ మోహన్ రావ్, అమర్నాథ్, అనిల్ కుమార్, పి.ఎల్ . శ్రీనివాస్ బరిలోకి దిగారు. అయితే చివరకు జగన్ మోహన్ రావే విజయం సాధించారు. జస్టిస్ లావునాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు మేరకు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజార్ సహా పలువురిపై ఉప్పల్ పీఎస్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. కొనుగోళ్లకు సంబంధించి కోట్లలో గోల్‌మాల్ జరిగిందన్న నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హెచ్ సీఏ ఎన్నికల ఫలితాలు
ప్రెసిడెంట్ – జగన్ మోహన్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్)
వైస్ ప్రెసిడెంట్ – దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానేల్)
సెక్రెటరీగా దేవరాజు(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)
జాయింట్ సెక్రెటరీగా బసవరాజు..(గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)
ట్రెజరర్ – సిజే శ్రీనివాస్ రావు(యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్)
కౌన్సిలర్ – సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చేయండి..