Hyderabad: బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న హైకోర్టు మహిళ జడ్జిలు

నాంపల్లి కోర్టులో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో హైకోర్టు జడ్జీలు పాల్గొన్న కార్యక్రమం ఆధ్యాంతం అందరినీ ఆకట్టుకుంది. నిరంతరం న్యాయవ్యవస్థలో బిజీగా గడిపే జడ్జిలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు.

Hyderabad: బతుకమ్మ  సంబరాల్లో పాల్గొన్న హైకోర్టు మహిళ జడ్జిలు
Honourable Lady Judges
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 20, 2023 | 9:32 PM

ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ వేడుకలు నాంపల్లి కోర్టులో ఘనంగా జరిగాయి. నాంపల్లి బార్ అసోసియషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిధిలుగా మహిళా జడ్జిలు హాజరు అయ్యారు. మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన జస్టిస్ జువ్వడి శ్రీదేవి, జస్టిస్ శ్రీ సుధా, జస్టిస్ సురేపల్లి నంద, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ప్రేమావతి బతుకమ్మ పాటలు స్వయంగా పాడుతూ కోలాటమాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు ఆటపాటలతో సంబరాలు చేశారు. కోర్టు భద్రతను పర్యవేక్షించే SPF సిబ్బందితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలు సందర్భంగా ఉత్తమంగా డ్యాన్స్ చేసిన ఉద్యోగినులకు బహుమతులు ప్రదానం చేశారు.

అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మహిళా ఐపీఎస్‌లు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళ ఐపీఎస్‌లతో పాటు మహిళా పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. దీంతో ప్రతి ఏటా ప్రభుత్వ కార్యాలయాలను మొదలుకొని ప్రైవేటు సంస్థల దాకా అన్నింటిలోనూ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళ ఐఏఎస్, ఐపీఎస్‌లు వివిధ కోర్టుల మహిళా జడ్జిలు, మహిళా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ప్రజలతో మమేకమై బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.

నాంపల్లి కోర్టులో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో హైకోర్టు జడ్జీలు పాల్గొన్న కార్యక్రమం ఆధ్యాంతం అందరినీ ఆకట్టుకుంది. నిరంతరం న్యాయవ్యవస్థలో బిజీగా గడిపే జడ్జిలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు. గౌరవప్రదమైన న్యాయవ్యవస్థలో నిరంతరం తీర్పులు వెల్లడించే.. మహిళ న్యాయమూర్తులు తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరించి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం విశేషం. తెలంగాణ మహిళా న్యాయమూర్తులు పాల్గొన్న ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ  చేయండి..