AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWC 2023 Closing Ceremony: ఎయిర్ షో నుంచి గత ఛాంపియన్ల పరేడ్ వరకు.. కళ్లు చెదిరేలా ముగింపు వేడుకలు..

ICC World Cup 2023 Closing Ceremony: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ మైదానంలో ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. ఈ మ్యాచ్‌ను మరింత గుర్తుండిపోయేలా చేసేందుకు ఐసీసీ, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి పలు కార్యక్రమాలను ప్లాన్ చేశాయి. అలాగే ప్రపంచకప్ విజేత జట్టు పేరును లేజర్ షోతో ముగింపు వేడుకలను ముగించాలని ICC యోచిస్తోంది. 1200 కంటే ఎక్కువ డ్రోన్‌లు అహ్మదాబాద్‌లోని ఆకాశంలో సందడి చేయనున్నాయి.

CWC 2023 Closing Ceremony: ఎయిర్ షో నుంచి గత ఛాంపియన్ల పరేడ్ వరకు.. కళ్లు చెదిరేలా ముగింపు వేడుకలు..
Icc World Cup 2023 Closing
Venkata Chari
|

Updated on: Nov 18, 2023 | 1:29 PM

Share

ICC World Cup 2023 Closing Ceremony: ICC ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ మహా పోరాటానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను మరింత గుర్తుండిపోయేలా చేసేందుకు ఐసీసీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో అపూర్వమైన ఘట్టానికి అభిమానులు సాక్ష్యమవ్వనున్నారు. టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా (India vs australia) మధ్య జరగనుండగా, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, అలాగే మ్యాచ్ మధ్యలో పలు కార్యక్రమాలతో అభిమానులను అలరించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇందుకోసం భారీ సన్నాహాలు కూడా ప్లాన్ చేశారు.

ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. అలాగే, మ్యాచ్ రోజున అంటే ఆదివారం వివిధ మ్యూజిక్ అండ్ లైట్ షో, ఎయిర్ షో కూడా జరగనుంది. ఇంతకు ముందు ఒకే మైదానంలో జరిగిన రెండు ఐపీఎల్ ఫైనల్స్‌లో ఎన్నో భారీ ఈవెంట్‌లు నిర్వహించారు. అందుకే ఈసారి ప్రపంచకప్ ఫైనల్స్‌లో కూడా అదే తరహా కార్యక్రమాలను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

మధ్యాహ్నం 12:30 గంటలకు వైమానిక ప్రదర్శన..

భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ బృందం 10 నిమిషాల ఎయిర్ షోతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్ షో జట్టు ఫ్లైట్ కమాండర్, డిప్యూటీ టీమ్ లీడర్ వింగ్ కమాండర్ సిద్దేష్ కార్తీక్ నేతృత్వంలో జరుగుతోంది. సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీమ్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి నరేంద్ర మోడీ స్టేడియం మీదుగా వర్టికల్ ఎయిర్ షోను ప్రదర్శిస్తుంది.

సాయంత్రం 5:30 గంటలకు 15 నిమిషాల పాటు ఛాంపియన్ల పరేడ్..

టోర్నమెంట్ చరిత్రలో తొలిసారిగా, 2023 ఫైనల్‌ను వీక్షించేందుకు ప్రపంచకప్ గెలిచిన అన్ని జట్ల కెప్టెన్‌లను ICC ఆహ్వానించింది. 1975 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ క్లైవ్ లాయిడ్ నుంచి గత ఎడిషన్ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వరకు, ప్రపంచ కప్ గెలిచిన ప్రతి జట్టు కెప్టెన్లు తమ ప్రపంచ కప్ ట్రోఫీలతో నరేంద్ర మోడీ స్టేడియంలో కనిపించనున్నారు. ప్రపంచకప్ చరిత్రలో మొత్తం ఐదు రకాల ట్రోఫీలు ఈసారి కనిపించనున్నాయి. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ కనిపించనున్నారు. అలాగే ప్రపంచకప్ థీమ్‌కు అనుగుణంగా రూపొందించిన బ్లేజర్లను కెప్టెన్లందరూ ధరించనున్నారు.

మ్యూజిక్ షో..

భారతదేశపు ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ తన బృందంతో కలిసి ‘దిల్ జష్న్ బోలే’ అనే సంగీత కార్యక్రమంలో అభిమానులను అలరించనున్నారు. 500 మందికి పైగా డ్యాన్సర్లు నరేంద్ర మోదీ స్టేడియంలో కేసరియా, దేవా దేవా, లహారా దో వంటి ప్రసిద్ధ పాటలకు ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఛాంపియన్ జట్టు కోసం 1200 డ్రోన్‌లతో డ్రోన్ షో..

ప్రపంచకప్ విజేత జట్టు పేరును లేజర్ షోతో ముగింపు వేడుకలను ముగించాలని ICC యోచిస్తోంది. 1200 కంటే ఎక్కువ డ్రోన్‌లు అహ్మదాబాద్‌లోని ఆకాశంలో సందడి చేయనున్నాయి. విజేత జట్టు పేరు జెండా స్తంభంపై ప్రదర్శించబడుతుంది. దీంతో పాటు బాణా సంచా పేల్చి ఈ ప్రపంచకప్‌నకు భారీగా ముగింపు పలకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?