AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: లెగ్ స్పిన్నర్ నుంచి ఫాస్ట్ బౌలర్‌గా మారిన హార్దిక్ పాండ్యా.. అసలు కారణం ఏంటంటే?

Hardik Pandya Birthday: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అక్టోబర్ 11న తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. నేటి భారత జట్టు పేస్ అటాక్‌లో 31 ఏళ్ల పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తన బౌలింగ్‌ ఆధారంగా ఓడిపోయే మ్యాచ్‌ను బోల్తా కొట్టించాడు.

Team India: లెగ్ స్పిన్నర్ నుంచి ఫాస్ట్ బౌలర్‌గా మారిన హార్దిక్ పాండ్యా.. అసలు కారణం ఏంటంటే?
Hardik Pandya Birthday
Venkata Chari
|

Updated on: Oct 11, 2024 | 10:42 AM

Share

Hardik Pandya Birthday: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అక్టోబర్ 11న తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. నేటి భారత జట్టు పేస్ అటాక్‌లో 31 ఏళ్ల పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తన బౌలింగ్‌ ఆధారంగా ఓడిపోయే మ్యాచ్‌ను బోల్తా కొట్టించాడు. ముందుగా ప్రమాదకరంగా కనిపిస్తున్న హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేయడం ద్వారా భాగస్వామ్యాన్ని విడదీసి, ఆ తర్వాత చివరి ఓవర్‌లో 16 పరుగులు చేసి 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. పాండ్యా 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 ముఖ్యమైన వికెట్లు తీశాడు. అయితే, ఇంత చరిష్మాతో బౌలింగ్ చేసిన పాండ్యా ఒకప్పుడు లెగ్ స్పిన్నర్ అని మీకు తెలుసా? ఆ తర్వాత జరిగిన ఓ సంఘటన అతని కెరీర్‌ని పూర్తిగా మార్చేసింది.

పాండ్యా ఫాస్ట్ బౌలర్‌గా ఎలా మారాడు?

హార్దిక్ పాండ్యా సూరత్ నివాసి. అయితే అతని తండ్రి హిమాన్షు పాండ్యా క్రికెట్‌ను కొనసాగించేందుకు బరోడాకు మారాడు. ఎందుకంటే, బరోడాలో క్రికెట్ ఆడేందుకు సౌకర్యాలు బాగానే ఉండేవి. ఆ తరువాత, అతను హార్దిక్, అతని అన్నయ్య కృనాల్‌ను భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కిరణ్ మోర్ అకాడమీలో చేర్చించాడు. అతని చిన్ననాటి వ్యక్తిగత కోచ్ జితేంద్ర కుమార్ ప్రకారం, 7 ఏళ్ల హార్దిక్ మొదటి నుంచి చాలా కష్టపడి పనిచేసేవాడు. అతను మొదట అకాడమీలో చేరిన సమయంలో బ్యాటింగ్ మాత్రమే చేసేవాడు. చాలా ఆలస్యంగా బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. మొదట లెగ్ స్పిన్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

ఫాస్ట్ బౌలర్‌గా హార్దిక్ సామర్థ్యాన్ని అతని చిన్ననాటి కోచ్ సనత్ కుమార్ గుర్తించారు. ఒక సంఘటన అతన్ని లెగ్ స్పిన్నర్ నుంచి ఫాస్ట్ బౌలర్‌గా మార్చింది. వాస్తవానికి, ఒకసారి నెట్ సెషన్ జరుగుతున్నప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఇందుకోసం కొంత మంది ఫాస్ట్ బౌలర్లు అవసరం కాగా ఫాస్ట్ బౌలర్లంతా అలసిపోయారు. అప్పుడు కోచ్ సనత్ కుమార్ నెట్స్‌లో బౌలింగ్ చేయమని అడిగాడు. ఈ సమయంలో హార్దిక్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. అతని వేగం, నియంత్రణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత సనత్ కుమార్ అతనికి ఇందులో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఫలితం నేడు అందరి ముందు కనిపిస్తుంది.

ఆరంభం నుంచి తుఫాన్‌ బ్యాటింగ్‌..

హార్దిక్ పాండ్యా మొదటి నుంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అని తెలిసిందే. పెద్ద హిట్‌లు కొట్టేందుకు ఎప్పుడూ హార్దిక్ భయపడడని వ్యక్తిగత కోచ్ చెప్పుకొచ్చాడు. గంటల తరబడి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనికి ఉందని తెలిపాడు. 2009లో విజయ్ హజారా ట్రోఫీ అండర్-16 టోర్నమెంట్‌లో హార్దిక్ 8 గంటల పాటు బ్యాటింగ్ చేసి 391 బంతుల్లో 228 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 29 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగా, అతను కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 జట్టులో ఎంపికయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..