IPL 2025: వేలంలోకి రోహిత్ వస్తే.. పాత రికార్డ్‌లు బద్దలవ్వాల్సిందే.. కాసుల వర్షమే: హర్భజన్ సింగ్
IPL 2025 Auction: IPL రాబోయే సీజన్ కోసం ఈసారి మెగా వేలం జరగబోతోంది. ఈ వేలంపై అభిమానుల్లో ఎంత ఉత్సుకత ఉందో మాజీ క్రికెటర్లలో కూడా అంతే ఉత్సుకత నెలకొంది. నిబంధనల మార్పు తర్వాత ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను రిటైన్ చేస్తారు, ఎవరిని విడుదల చేయబోతున్నారనే దానిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఉన్నారు. చాలా మంది వెటరన్ క్రికెటర్లు కూడా దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూనే ఉన్నారు.
IPL 2025 Auction: IPL రాబోయే సీజన్ కోసం ఈసారి మెగా వేలం జరగబోతోంది. ఈ వేలంపై అభిమానుల్లో ఎంత ఉత్సుకత ఉందో మాజీ క్రికెటర్లలో కూడా అంతే ఉత్సుకత నెలకొంది. నిబంధనల మార్పు తర్వాత ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను రిటైన్ చేస్తారు, ఎవరిని విడుదల చేయబోతున్నారనే దానిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఉన్నారు. చాలా మంది వెటరన్ క్రికెటర్లు కూడా దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. వేలంలోకి రోహిత్ శర్మ వస్తే ఏం జరగుతుందో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ క్లారిటీ ఇచ్చేశాడు.
హర్భజన్ ఏం చెప్పాడంటే?
వేలంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉండటం ఈ ఈవెంట్‌ను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుందని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన భజ్జీ, రోహిత్ శర్మ వేలంలోకి వస్తే, అతని కోసం జట్లు వేలంలో పోటీ పడడం ఆసక్తికరంగా ఉంటుందని తెలిపాడు. వేలానికి ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టవచ్చని నివేదికలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
‘చాలా జట్లు వరుసలో ఉంటాయి’
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన హర్భజన్, ‘రోహిత్‌ను రిటైన్ చేస్తారా లేదా అనేది చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. అతను వేలం పూల్‌లోకి వెళితే, అతని కోసం ఏ జట్టు వేలం వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. చాలా జట్లు అతనిపై కన్నేస్తాయని నేను అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే, రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు. అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని తెలిపాడు.
‘కాసుల వర్షం కురవాల్సిందే’
రోహిత్ కెప్టెన్సీ గురించి హర్భజన్ మాట్లాడుతూ, ‘రోహిత్ శర్మ నాయకుడిగా, ఆటగాడిగా అద్భుతంగా ఉన్నాడు. అతను అద్భుతమైన ఆటగాడు, అంతే అద్భుతమైన కెప్టెన్. అతను మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. 37 ఏళ్ల వయసులో కూడా అతనిలో చాలా క్రికెట్ మిగిలి ఉంది. ఒకవేళ రోహిత్ వేలంలోకి దిగితే భారీ మొత్తం దక్కుతుంది. అలాంటి వేలం చూడటం ఉత్కంఠగా ఉంటుందని’ ఆయన అన్నారు.
రోహిత్ శర్మ ఎంఐని వదులుకుంటాడా?
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రాబోయే సీజన్ కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్‌లను, గరిష్టంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను ఉంచుకోవడానికి జట్లను అనుమతించింది. అయితే, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ క్రమంలో రోహిత్ శర్మ ముంబై జట్టును వదిలేస్తాడా లేదా ప్లేయర్‌గానే కొనసాగుతాడా లేనది చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..