Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH కాదు.. ఈ సారి 300 కొట్టేది మేమే! వామ్మో.. ఈ టీమిండియా ప్లేయర్‌ కాన్ఫిడెన్స్‌ ఓ రేంజ్‌లో ఉందిగా..!

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విధ్వంసం గురించి అంచనాలున్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 300 పరుగుల లక్ష్యాన్ని ప్రకటించాడు. గత సీజన్‌లో తన తప్పులను సరిదిద్దుకుని, బ్యాటింగ్, కెప్టెన్సీని వేరు చేసి ఆడతానని అన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కూడా భారీ స్కోర్లకు దోహదపడుతుందని గిల్ అభిప్రాయపడ్డాడు.

SRH కాదు.. ఈ సారి 300 కొట్టేది మేమే! వామ్మో.. ఈ టీమిండియా ప్లేయర్‌ కాన్ఫిడెన్స్‌ ఓ రేంజ్‌లో ఉందిగా..!
Shubman Gill Srh
Follow us
SN Pasha

|

Updated on: Mar 20, 2025 | 7:42 AM

ఐపీఎల్‌ 2025 కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా వేయిట్‌ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ సునామీ కోసం వేయి కళ్లతో ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్ల ఊచకోత ఆ రేంజ్‌లో ఉంటోంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ మొత్తం కాటేరమ్మ కొడుకులతో నింపేసింది కావ్య మారన్‌. వాళ్ల బ్యాటింగ్‌ విధ్వంస గత సీజన్‌లో చూశాం.. మరి ఇప్పుడు దాని మించి ఎస్‌ఆర్‌హెచ్‌ 2.ఓ చూస్తామని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. సన్‌రైజర్స్‌ నినాదం ఒక్కటే అబ్‌కీ బార్‌ 300 పార్‌ అంటూ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలా ఒకవైపు ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ గురించి అంతా మాట్లాడుకుంటుంటే.. టీమిండియా యంగ్‌ బ్యాటర్‌, ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌, ప్రిన్స్‌ శుబ్‌మన్‌ గిల్‌ అందరికీ ఊహించని షాకిచ్చాడు. ఏ ఊకోండి భయ్యా.. ఎస్‌ఆర్‌హెచ్‌ వాళ్లే కాదు మేం కూడా ఈ సారి 300 కొట్టి చూపిస్తామంటూ మంచి కాన్ఫిడెన్స్‌ చూపిస్తున్నాడు.

తాజాగా ఐపీఎల్‌ స్టార్ట్‌కి ముందు మాట్లాడిన గిల్‌.. తమ టీమ్‌కు మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉందని, దానికి తోడు ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ వల్ల భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుందని, ఈ సారి 300 కొడతాం అంటూ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2024కి ముందు హార్ధిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో శుబ్‌మన్ గిల్‌ గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా గిల్‌కు ఇది రెండో సీజన్‌. గత సీజన్‌లో జీటీ అంత మంచి ప్రదర్శన కనబర్చలేదు. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ సారి మాత్రం అది రిపీట్‌ చేయొద్దని కెప్టెన్‌ గిల్‌ భావిస్తున్నాడు.

అలాగే తన కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. ప్రతి ప్లేయర్‌కు వారి వారి స్టైల్‌ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకొని వారిని అలా ఆడనివ్వాలి. కెప్టెన్‌గా నేను అదే చేస్తాను అని అన్నాడు. అలాగే కెప్టెన్‌ అనే ఆలోచన మనం బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మైండ్‌లోకి రానివ్వొద్దని అన్నాడు. కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా తన బ్యాటింగ్‌లో మార్పు రాదంటూ స్పష్టం చేశాడు. లాస్ట్‌ సీజన్‌లో నేను చేసిన తప్పులు ఈ సీజన్‌లో రిపీట్‌ చేయను. బ్యాటింగ్‌, కెప్టెన్సీ రెండు వేరు వేరు అని అర్థం చేసుకున్నాను. లాస్ట్‌ సీజన్‌లో కెప్టెన్సీ గురించి ఎక్కువ ఆలోచించాను, అది బ్యాటింగ్‌పై ప్రభావం చూపిందని, ఈ సారి మాత్రం అలా ఉండదని అన్నాడు. మరి గిల్‌ చెప్పినట్లు.. ఈ సారి 300 స్కోర్‌ ఎవరు కొడతారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరోసారి సమంత పై వివాదాస్పద కామెంట్స్ చేసిన వేణు స్వామి
మరోసారి సమంత పై వివాదాస్పద కామెంట్స్ చేసిన వేణు స్వామి
పైకి చూస్తే మాములు యాక్సిడెంట్ అనుకునేరు..
పైకి చూస్తే మాములు యాక్సిడెంట్ అనుకునేరు..
ప్లే ఆఫ్స్‌ చేరే 4 టీమ్స్‌ ఇవే.. కుండబద్దలు కొట్టిన సెహ్వాగ్‌!
ప్లే ఆఫ్స్‌ చేరే 4 టీమ్స్‌ ఇవే.. కుండబద్దలు కొట్టిన సెహ్వాగ్‌!
మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై క్లారిటీ ఇచ్చేసిన పృథ్వీరాజ్
మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై క్లారిటీ ఇచ్చేసిన పృథ్వీరాజ్
ఒక్కసినిమాతో భారీ పాపులారిటీ.. అరడజన్ సినిమాలతో ఫుల్ బిజీ!
ఒక్కసినిమాతో భారీ పాపులారిటీ.. అరడజన్ సినిమాలతో ఫుల్ బిజీ!
వేద పాఠశాల సమీపాన నిర్మానుష్య ప్రదేశం.. అదో మాదిరి శబ్దాల
వేద పాఠశాల సమీపాన నిర్మానుష్య ప్రదేశం.. అదో మాదిరి శబ్దాల
స్టైలిష్ లుక్‌లో అంజలి.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
స్టైలిష్ లుక్‌లో అంజలి.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
మేడం అయితే.. సార్ ఫోన్ చేశారేంటి..? అనుమానంతో ఆరా తీయగా..
మేడం అయితే.. సార్ ఫోన్ చేశారేంటి..? అనుమానంతో ఆరా తీయగా..
ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా సరే.. ఆ సినిమానే ఇష్టం అంటున్న ప్రభాస్!
ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా సరే.. ఆ సినిమానే ఇష్టం అంటున్న ప్రభాస్!
చిన్న పొదుపే తారక మంత్రం.. డబ్బు రాబడిని ఇలా పెంచుకోండి
చిన్న పొదుపే తారక మంత్రం.. డబ్బు రాబడిని ఇలా పెంచుకోండి