GT vs PBKS: 11 సిక్సులు, 11 ఫోర్లతో శ్రేయాస్, శశాంక్ సింగ్‌ల వీరంగం.. గిల్‌సేనకు భారీ టార్గెట్..
ఐపీఎల్-18 5వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతోంది. గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్‌కు భారీ టార్గెట్ అందించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీకి 3 పరుగల దూరంలో ఆగిపోయాడు.

ఐపీఎల్-18 5వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతోంది. గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్‌కు భారీ టార్గెట్ అందించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీకి 3 పరుగల దూరంలో ఆగిపోయాడు. ఇందులో 9 సిక్సులు, 5 ఫోర్లతో ఏకంగా 230కిపైగా స్ట్రైక్‌రేట్‌తో గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడాడు. అలాగే, శశాంక్ సింగ్ కూడా కేవలం 16 బంతుల్లో 44 పరుగులతో చెలరేగిపోయాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
మార్కస్ స్టోయినిస్ 20 పరుగులకు, గ్లెన్ మాక్స్‌వెల్ సున్నా పరుగులకు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 16 పరుగులకు అవుటయ్యారు. ఆ ముగ్గురినీ సాయి కిషోర్ పెవిలియన్ చేర్చాడు. ప్రియాంష్ ఆర్య (47 పరుగులు)ను రషీద్ ఖాన్ అవుట్ చేయగా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (5 పరుగులు)ను కగిసో రబాడ అవుట్ చేశాడు.
No sympathy No pr No comeback ads No being unlucky crying No fitness issue No excuses No failure coverup No statpading or selfless cry
Just pure performance and dedication for the team. That’s Shreyas Iyer for you pic.twitter.com/RPCnCJLrMs
— ` (@Dhoni_fied) March 25, 2025
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: నేహాల్ వధేరా, ప్రవీణ్ దూబే, వైషాక్ విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్.
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, ఇషాంత్ శర్మ, అనుజ్ రావత్, వాషింగ్టన్ సుందర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..