Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీపై ఓటమితో లక్నోకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన రూ. 9.75 కోట్ల ప్లేయర్?

Lucknow Super Giants, IPL 2025: రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. కానీ, ఇప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ ఫిట్‌గా ఉండటంతో రిషబ్ పంత్ జట్టుకు పెద్ద ఉపశమనం లభించినట్లైంది. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

ఢిల్లీపై ఓటమితో లక్నోకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన రూ. 9.75 కోట్ల ప్లేయర్?
Lsg team
Follow us
Venkata Chari

|

Updated on: Mar 25, 2025 | 4:31 PM

Avesh Khan May Fit to Join in Lucknow Super Giants: హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ఆర్‌సీబీ వంటి జట్లు ఐపీఎల్ 2025 సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లోనే విజయంతో ఖాతా తెరిచాయి. రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. దీని తరువాత, రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నోకు పెద్ద ప్రయోజనం లభించింది. ఆ జట్టు డాషింగ్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ ఇప్పుడు జట్టులో చేరడానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారు.

ఫిట్‌గా మారిన అవేష్ ఖాన్..

నిజానికి, అవేష్ ఖాన్ కొంతకాలంగా కుడి కాలు మోకాలికి నొప్పితో బాధపడుతున్నాడు. కానీ, ఇప్పుడు అతను కోలుకోవడం పూర్తయింది. బీసీసీఐ వైద్య బృందం అతనికి ఐపీఎల్ ఆడటానికి అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి అవేష్ ఖాన్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాగా, భారతదేశం తరపున చివరి టీ20 మ్యాచ్ గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగింది. కానీ, ఇప్పుడు అతను లక్నో జట్టులో చేరడం ద్వారా ఐపీఎల్‌లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు.

అవేష్ ఖాన్ పై కోట్ల వర్షం..

అవేష్ ఖాన్ గురించి చెప్పాలంటే, అతను ఎప్పుడు జట్టులో చేరతాడో ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు . కానీ, మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు అతను జట్టులో చేరవచ్చని భావిస్తున్నారు. లక్నో జట్టు రూ.9.75 కోట్లు చెల్లించి అవేష్ ఖాన్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీలకు ఆడుతున్న అవేష్ ఇప్పటివరకు 63 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసి 74 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం