Virat Kohli: సోషల్ మీడియాలో మ్యాక్స్‌వెల్‌ను బ్లాక్ చేసిన కింగ్ కోహ్లీ.. అసలు ఏం జరిగిందంటే?

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ తన ఆత్మకథలో ఇప్పుడు సంచలనం రేపుతోంది. . ప్రస్తుతం ఆర్ సీబీలో ఆడుతోన్న 'గ్లెన్ మాక్స్‌వెల్-ది షోమ్యాన్' పేరుతో ఈ బుక్ ను విడుదల చేశాడు. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి

Virat Kohli: సోషల్ మీడియాలో మ్యాక్స్‌వెల్‌ను బ్లాక్ చేసిన కింగ్ కోహ్లీ.. అసలు ఏం జరిగిందంటే?
Glenn Maxwell, Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Oct 30, 2024 | 2:05 PM

విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇద్దరూ మంచి స్నేహితులు అన్నది క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. ముఖ్యంగా ఆర్సీబీ టీమ్‌లో చాలా ఏళ్ల పాటు ఇద్దరూ కలిసి ఆడుతున్నారు. అయితే అది ఇప్పుడు. ఇంతకు ముందు కింగ్ కోహ్లీ, మ్యాక్సీ మధ్య అంతా సరిగ్గా లేదని తేలింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 2017 బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ భుజం నొప్పితో బాధపడ్డాడు. అయితే కోహ్లీ ఆవేదనను ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఎగతాళి చేశాడు. ఈ అవమానానికి కోహ్లి మనస్తాపం చెంది మ్యాక్స్‌వెల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడు. అయితే ఈ విషయం గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు తెలియదు. 2022లో ఆర్‌సీబీ టీమ్‌లోకి అడుగుపెట్టిన మ్యాక్స్‌వెల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని ఫాలో అయ్యాడు. కానీ కోహ్లీ ఖాతా ఎక్కడా కనిపించలేదు. దీనిపై గ్లెన్ మాక్స్‌వెల్ విరాట్ కోహ్లీని అడిగాడు. అలాగే మీ అకౌంట్ కనిపించడం లేదు…మీరు ఏమైనా బ్లాక్ చేశారా? విరాట్ కోహ్లీ అవుననే సమాధానమిచ్చాడు. ఎందుకని అడిగితే ఐదేళ్ల నాటి కథ చెప్పాడు.

2017లో బోర్డర్-గవాస్కర్ టెస్టు మ్యాచ్ సందర్భంగా నన్ను ఎగతాళి చేసినందుకే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నన్ను బ్లాక్ చేశానని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఈ ఆలోచనను ఇప్పుడు LiSTNR స్పోర్ట్ విల్లో టాక్ పోడ్‌కాస్ట్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ వెల్లడించారు. ‘దీని తర్వాత మేం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు వచ్చిన మొదటి వ్యక్తి విరాట్ కోహ్లీ. అందుకే ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం’ అని గ్లెన్ మ్యాక్స్ వెల్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మ్యాక్సీ మాటల్లో..

ఎగతాళి చేసినందుకే బ్లాక్ చేశాడు.. కానీ .. ఆ తర్వాత..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..