Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్..ఇది ఫ్యాన్స్‌కి గూడ్ న్యూసా? లేక బ్యాడ్ న్యూసా?
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా తనకు ఓ అవకాశం ఇవ్వాలని యాజమాన్యాన్ని విరాట్ కోహ్లీ కోరినట్లు చర్చ జరుగుతుంది. ఏదైతేనేం కోహ్లీ కెప్టెన్ అవుతున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే కోహ్లికి ఆర్సీబీ కెప్టెన్సీ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.. ఎలా అంటే..
ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల రిటెన్షన్‌పై రచ్చ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో రిటైన్షన్ లీస్టులు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ సంబంధించిన ఓ వార్త ఆర్సీబీ అభిమానులకు సంతోషనిచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా తనకు అవకాశం ఇవ్వాలని విరాట్ యాజమాన్యాన్ని కోరినట్లు ESPN-క్రిక్‌ఇన్ఫో ఒక వీడియోలో పేర్కొంది. దీంతో RCB అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతానికైతే ఇది ఓ రూమరే.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడల్సిందే.
అయితే ఇది ఇలా ఉంటే కోహ్లీకి కెప్టెన్సీ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. 2011 నుంచి ఐపీఎల్‌లో విరాట్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ లీగ్‌లో చాలా పరుగులు చేశాడు. దీంతో విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. కానీ కెప్టెన్సీ విషయానికి వస్తే మాత్రం వెనుకబడ్డాడనే చెప్పాలి. అతను 2013లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. 9 సీజన్లకు కెప్టెన్‌గా ఉన్న తర్వాత, 2021లో విరాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లి 143 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించాడు. దీంతో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన మూడవ కెప్టెన్‌గా కూడా విరాట్ నిలిచాడు. విరాట్ కెప్టెన్‌గా ఉండగా, RCB 143 మ్యాచ్‌లలో 66 గెలిచింది, అయితే 70 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మ్యాచ్ విన్నింగ్ శాతం కేవలం 46.15 శాతం మాత్రమే కావడం గమనార్హం. RCB 4 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది, ఒకసారి ఫైనల్ ఆడింది.
ఐపీఎల్‌లో అత్యధికంగా కెప్టెన్‌గా వ్యవహరించిన టాప్-5 కెప్టెన్‌లతో విరాట్ కోహ్లీ చాలా వెనుకబడి ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక కెప్టెన్సీ చేసిన రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. అతను చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌తో కలిపి మొత్తం 226 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో 133 మ్యాచ్‌లు గెలిచాడు. 99లో ఓడిపోయాడు. ధోని విన్నింగ్ శాతం 58.84 ఉండడంతో పాటు, తన జట్టుకు 5 సార్లు ట్రోఫీని అందించాడు. రోహిత్ శర్మ 158 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉండగా, 87 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 67 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. రోహిత్ విన్నింగ్ శాతం 55.06 ఉండడంతో పాటు, తన జట్టుకు 5 సార్లు ట్రోఫీని అందించాడు.