Video: చేతులకు నూనె రాసుకుని వచ్చారా ఏంది భయ్యా.. ఫీల్డింగ్ మిస్టేక్స్‌తో పిచ్చెక్కించిన రోహిత్ సేనపై విమర్శలు
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో, బంగ్లాదేశ్‌పై భారత జట్టు బౌలింగ్ అద్భుతంగా ఉంది. కానీ, ఫీల్డింగ్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్‌కు ప్రాణం పోయడంతో హాఫ్ సెంచరీలతో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీం ఇండియా తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన బౌలింగ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కానీ, ఫీల్డింగ్ విషయంలో చాలా నిరాశపరిచింది. బంగ్లాతో మ్యాచ్‌లో టీం ఇండియా బంగ్లాదేశ్ జట్టుకు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు అవకాశాలు ఇచ్చింది. కీలక విషయం ఏమిటంటే ఈ మూడు తప్పులూ టీమిండియా సీనియర్ ఆటగాళ్లే చేయడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొలి తప్పు చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్‌కు ప్రాణం పోశారు. ముగ్గురు ఆటగాళ్ళు చేతులకు వెన్న పూసుకుని వచ్చారా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
ఈజీ క్యాచ్ వదిలేసిన రోహిత్ శర్మ..
If you want to abuse rohit sharma here is the video :pic.twitter.com/FC7yPqHDcD
ఇవి కూడా చదవండి— Rathore (@exBCCI_) February 20, 2025
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 9వ ఓవర్లో క్యాచ్ వదిలేయడం మొదటి తప్పు. ఈ పొరపాటు అందరి హృదయాలను బద్దలు కొట్టింది. ఎందుకంటే, అక్షర్ పటేల్ ఈ క్యాచ్ తీసుకుని ఉంటే హ్యాట్రిక్ సాధించేవాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో జాకీర్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను రోహిత్ శర్మ జారవిడిచాడు. క్యాచ్ మిస్ అయిన తర్వాత, రోహిత్ శర్మ చాలా నిరాశ చెందాడు. అతను తన చేతిని నేలకు కొట్టి తనను తాను శిక్షించుకున్నాడు.
మరో క్యాచ్ జారవిడిచిన హార్దిక్ పాండ్యా..
రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా క్యాచ్ వదిలేసి తప్పు చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో తౌహీద్ హృదయ్ క్యాచ్‌ను పాండ్యా వదిలేశాడు. ఇది చాలా సులభమైన క్యాచ్. హార్దిక్ ఈ అవకాశాన్ని మిస్ చేశాడు. కీలక విషయం ఏమిటంటే ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఆ తర్వాత అర్ధ సెంచరీలు సాధించారు.
కేఎల్ రాహుల్ రూపంలో మరో తప్పు..
23వ ఓవర్లో జాకీర్ అలీకి కూడా కేఎల్ రాహుల్ అవకాశం ఇచ్చాడు. ఈ ఆటగాడు జాకీర్ అలీని స్టంప్ చేసే సులభమైన అవకాశాన్ని కోల్పోయాడు. రవీంద్ర జడేజా వేసిన బంతికి కేఎల్ రాహుల్ ఈ తప్పు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ దీనిని సద్వినియోగం చేసుకుని సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








