IND vs AUS: ఆస్ట్రేలియాతో ఢీ కొట్టే భారత జట్టు ఇదే.. 5 కంటే తక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడిన 10 మందికి లక్కీ ఛాన్స్..?
India vs Australia ODI Series: ఆసియా కప్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఈ సమయంలో, టీం ఇండియా వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 19న, రెండవ మ్యాచ్ అక్టోబర్ 23న, మూడవ మ్యాచ్ అక్టోబర్ 25న జరగనుంది. వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రావడం దాదాపు ఖాయం.

IND vs AUS ODI Series: ఆసియా కప్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్ష జరిగింది. ఈ సిరీస్‌లో చాలా కాలం తర్వాత హిట్‌మ్యాన్, విరాట్ కోహ్లీ భారత జెర్సీలో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు జట్టు దాదాపుగా ఫిక్స్ అయింది. ఈ వన్డే సిరీస్‌లో, టీం ఇండియా తరపున 5 కంటే తక్కువ వన్డేలు ఆడిన 10 మంది ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. ఈ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియా సిరీస్‌తో రోహిత్, విరాట్ రీఎంట్రీ..
ఆసియా కప్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఈ సమయంలో, టీం ఇండియా వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 19న, రెండవ మ్యాచ్ అక్టోబర్ 23న, మూడవ మ్యాచ్ అక్టోబర్ 25న జరగనుంది. వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రావడం దాదాపు ఖాయం. NCAలో హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని నివేదికలు కూడా వచ్చాయి.
5 వన్డేలు కూడా ఆడలే.. ఆస్ట్రేలియాపై బరిలోకి..
యశస్వి జైస్వాల్- టెస్ట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ టెస్ట్‌లలో చాలా బాగా రాణించాడు. అతను టెస్ట్‌లలో 6 సెంచరీలు, టీ20లో ఒక సెంచరీ చేశాడు. కానీ, అతనికి భారత జట్టు నుంచి ఒకే ఒక ODIలో అవకాశం లభించింది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో అతను జట్టులో భాగం కావచ్చు.
రియాన్ పరాగ్- యువ ఆటగాడు రియాన్ పరాగ్ కు భారత జట్టు తరపున టీ-20లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ అతను ఇప్పటివరకు టీం ఇండియా తరఫున ఒకే ఒక్క వన్డే ఆడగలిగాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరిగే వన్డేలో అతనికి అవకాశం రావచ్చు.
రజత్ పాటిదార్- ఆర్‌సీబీని విజయపథంలో నడిపించిన కెప్టెన్ రజత్ పాటిదార్, టీమిండియా తరపున మూడు వన్డేలు ఆడే అవకాశం పొందాడు. ఈ సమయంలో, అతను 63 పరుగులు చేశాడు.
సాయి సుదర్శన్- సాయి సుదర్శన్ టీమిండియా తరపున మూడు వన్డేల్లో 140 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
రింకు సింగ్ – తన విధ్వంసక బ్యాటింగ్‌కు పేరుగాంచిన రింకు సింగ్‌కు టీమ్ ఇండియా తరపున రెండు వన్డేలు ఆడే అవకాశం లభించింది. అందులో అతను 55 పరుగులు చేశాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.
తిలక్ వర్మ- టీ20లో రెండు సెంచరీలు చేసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తిలక్ వర్మ, టీమ్ ఇండియా తరపున కేవలం 4 ODIలు మాత్రమే ఆడే అవకాశం పొందాడు. ఆ సమయంలో అతను 68 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది.
కుల్దీప్ యాదవ్- కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ టీం ఇండియా తరపున ఒక ODI మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలో అతను రెండు వికెట్లు పడగొట్టాడు.
షాబాజ్ అహ్మద్- ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ కు టీం ఇండియా తరపున మూడు వన్డేలు ఆడే అవకాశం లభించింది. ఆ సమయంలో అతను మూడు వికెట్లు పడగొట్టాడు.
రవి బిష్ణోయ్- లెగ్ బ్రేక్ గూగ్లీకి ప్రసిద్ధి చెందిన రవి బిష్ణోయ్, టీం ఇండియా తరపున ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడి, ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో అతనికి అవకాశం లభించవచ్చు.
శివం దూబే- ఆల్ రౌండర్ ఆటగాడు శివం దూబే నిరంతరం T20 జట్టులో భాగమే, కానీ అతనికి భారత జట్టు తరపున 4 ODIలు మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఈ సమయంలో, అతను 43 పరుగులు చేశాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియా ప్రాబబుల్ స్వ్కాడ్..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రజత్ పాటిదార్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, విరాట్ కోహ్లి, రియాన్ పరాగ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, షాబాజ్ అహ్మద్.
గమనిక- ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఈ 10 మంది ఆటగాళ్లలో కొందరికి ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో అవకాశం ఇవ్వవచ్చు. కొన్ని నివేదికల మేరకు ఈ సమాచారం అందించాం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








