IPL 2025: ముగ్గురు చెన్నై ప్లేయర్లపై కన్నేసిన ఆర్‌సీబీ.. వేలానికి ముందే భారీ స్కెచ్..
IPL 2025 Mega Auction: టోర్నీలో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వేలానికి ముందు కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. RCB వేలంలో భారీ మొత్తంలో డబ్బును కలిగి ఉంటుంది. CSK విడుదల చేసిన అత్యుత్తమ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ భారీ ప్లాన్ వేస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్ కోసం వేలం నవంబర్ 24-25 తేదీలలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలానికి ముందు, అన్ని జట్లు ఆటగాళ్లను రిటైన్ చేసి విడుదల చేశాయి. టోర్నీలో అత్యధిక టైటిళ్లలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలో చెన్నై విడుదల చేసిన ముగ్గురు ఆటగాళ్లపై బెంగళూరు జట్టు ఓ భారీ ప్లాన్ వేస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. CSK విడుదల చేసిన ముగ్గురు ఆటగాళ్లపై కన్నేసిన బెంగళూరు..
3. తుషార్ దేశ్‌పాండే..
ముంబై ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్ పాండే చాలా తక్కువ అంచనాలున్నా ఫాస్ట్ బౌలర్. IPL మొదటి రెండు సీజన్‌లు బాగాలేకపోవడంతో, దేశ్‌పాండేను CSK కొనుగోలు చేసింది. అతను మొదటి సీజన్‌లోనే అద్భుతంగా ఆడాడు. 2023లో దేశ్‌పాండే 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీయగా, గత సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. RCB మహ్మద్ సిరాజ్‌ని విడుదల చేసింది. కాబట్టి కొత్త బంతితో ప్రారంభించడానికి బెంగళూరుకు మంచి భారత బౌలర్ కూడా అవసరం. ఇటువంటి పరిస్థితిలో, తుషార్ మంచి ఎంపిక కావచ్చు.
2. శార్దూల్ ఠాకూర్..
ముంబై నుంచి దేశవాళీ క్రికెట్ ఆడే భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ కూడా CSK కోసం కొన్ని సీజన్లు ఆడాడు. ఐపీఎల్‌లో శార్దూల్ గత రెండు సీజన్‌లు సరిగ్గా సాగలేదు. అయితే, అతను అద్భుతమైన ఆల్ రౌండర్. అత్యంత కష్ట సమయాల్లో భాగస్వామ్యాలను బ్రేక్ చేయడంలో శార్దూల్‌ను గోల్డెన్ ఆర్మ్ అని కూడా పిలుస్తారు. శార్దూల్ లోయర్ ఆర్డర్‌లో కూడా ధీటుగా బ్యాటింగ్ చేయగలడు. ఇటువంటి పరిస్థితిలో, శార్దూల్ ఆల్ రౌండ్ ఎంపికగా RCBకి బాగా సహకరించగలడు.
1. రచిన్ రవీంద్ర..
న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను గత సీజన్‌లో CSK కేవలం రూ. 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్‌లో అతనికి భారీ బిడ్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఇటీవల బెంగళూరులోనే భారత్‌తో జరిగిన టెస్టులో సెంచరీ సాధించాడు. అతని కోసం CSK RTM కార్డును ఉపయోగిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే RCB కూడా అతని కోసం పూర్తి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేయడంతో RCB కూడా మంచి ఓపెనర్ కోసం వెతుకుతోంది. రచిన్ స్పిన్ బౌలింగ్‌లో కూడా సహకరించగలడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..