Obesity: ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే.. మన శరీరంలో కొవ్వు పెరుగుతుంది
స్పీడ్ స్పీడ్....స్పీడ్ గా అన్ని పనులు అయిపోవాలి .స్ప్పేడ్ గా ఇంటర్నెట్ రావాలి....ఎవ్వరికి నెట్ స్లో గా వస్తే నచ్చదు...ఏజ్ తో సంబంధం లేదు...పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళవరకు ఇంతే ఆఖరికి చిన్న పిల్లలు ఫోన్ లో కార్టూన్ చూస్తుంటే నెట్ స్లో గా వచ్చినా వాళ్లు ఆగలేరు...ఇది 21stసెంచరీ కదా మరి! కాకపోతే ఇంటర్నెట్ వేగానికి... మనిషిలో కొవ్వు పెరగటానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా… చాలామంది, ముఖ్యంగా యువతరం ఆన్‌లైన్లో మునిగితేలుతోంది. జీవితాన్ని, అందులోని వేగాన్ని ఎంజాయ్ చేస్తున్నామను కుంటున్నారుగాని నెట్‌లో చిక్కుకొని ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నామని తెలుసుకోలేకపోతోంది. ‘ఇంటర్నెట్ హైస్పీడ్ పనులను వేగవంతం చేయటమేగాదు… మన శరీరంలో కొవ్వును కూడా వేగంగా పెంచుతోంది’ అని ఆస్ట్రేలియాలోని మొనాష్ బిజినెస్ స్కూల్ ఆచార్యుడు డాక్టర్ క్లౌస్ అకల్‌మన్ వెల్లడించారు. మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం, రాయల్ మెల్‌బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా 2006 నుంచి 2019 దాకా ఈ అంశంపై అధ్యయనం చేశాయి. హైస్పీడ్ ఇంటర్నెట్.. మనుషుల్లో ఊబకాయం, అధికబరువులకు కారణం అవుతుందని వీరి అధ్యయనంలో తేలింది. హైస్పీడ్ ఇంటర్నెట్ వల్ల వివిధ రకాల సేవలు, కొనుగోళ్లు అన్నీ ఆన్‌లైన్లోనే సాగిపోతున్నాయి. దీంతో ఇంట్లోంచి కాలు కదపటం తగ్గుతోంది. అంతేగాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కూడా కలవటం తగ్గించి… ఆన్‌లైన్లోనే పలకరించేస్తున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పలకరింపులు సాగుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో వర్షాలు !! ఎప్పటి వరకు అంటే ??
మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో అనిత ఫైర్.. వైసీపీ ఎమ్మెల్సీలకు మాస్ వార్నింగ్
బిగ్ అలెర్ట్.. మీ పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ అయి ఉందా ??
ఆలయాల చుట్టూ అఘోరీ మాత ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి ??
చాలా ఏళ్లకు కనిపించి.. సడ్‌సర్‌ప్రైజ్ చేసిన తమ్ముడు హీరోయిన్