అంబులెన్స్‌లో భారీ పేలుడు.. లోపల నిండు గర్భిణీ..
నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇంతలో ఊహించని విధంగా అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. ఈ హఠాత్‌పరిణామానికి అంబులెన్స్‌లోనివారంతా తీవ్ర భయాందోళన చెందారు. పరిస్థితి అర్ధమై అంబులెన్స్ డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
అందరూ ప్రాణాలతో బయట పడ్డారు. మహారాష్ట్ర రాష్ట్రం జల్గావ్ జిల్లాలోని దాదావాడి ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అంబులెన్స్‌లో గర్భిణీని తన కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు. ఇంతలో తన వాహనం నుంచి పొగలు రావడంతో అంబులెన్స్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనం దిగిపోయాడు. అదే విధంగా అంబులెన్స్‌లో ఉన్నవారిని కూడా తక్షణమే కిందికి దిగాలని కోరాడు. ఆ తర్వాత వాహనం మొత్తం మంటలు వ్యాపించి అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌కు అంటుకున్నాయి. దీంతో పెద్ద పెద్ద శబ్దాలతో అంబులెన్స్ పేలిపోయింది. అప్పటికే అంబులెన్స్‌లో ఉన్నవారు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. సంఘటనా స్థలంలో స్థానికులు గుమిగూడడంతో హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మంత్రి గులాబ్‌రావు పాటిల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తులసీ గబ్బార్డ్ నియామకం.. పాకిస్థాన్‌ను భయపెడుతుంటే.. భారత్‌ను సంతోషపెడుతోందా ??
Obesity: ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే.. మన శరీరంలో కొవ్వు పెరుగుతుంది
ఏపీలో వర్షాలు !! ఎప్పటి వరకు అంటే ??
మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో అనిత ఫైర్.. వైసీపీ ఎమ్మెల్సీలకు మాస్ వార్నింగ్
బిగ్ అలెర్ట్.. మీ పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ అయి ఉందా ??
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

